Dil Raju : శతమానం భవతి సీక్వెల్, ఆర్య 3.. రెండు సినిమాలు ఆ హీరోతోనే చేయనున్న దిల్ రాజు..?
గత సంవత్సరం దిల్ రాజు శతమానం భవతి సీక్వెల్ కూడా ప్రకటించాడు. ఇటీవల దిల్ రాజు ఆర్య 3 టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించాడు.

Dil Raju Planning Shathamanam Bhavathi Sequel and Arya 3 Movies with Ashish Reddy
Dil Raju : దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చిన సినిమాల్లో ఆర్య, శతమానం భవతి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయి క్లాసిక్స్ లా నిలిచాయి అందరికి తెలిసిందే. ఆర్య కు సీక్వెల్ గా ఆర్య 2 ఆల్రెడీ వచ్చింది. గత సంవత్సరం దిల్ రాజు శతమానం భవతి సీక్వెల్ కూడా ప్రకటించాడు. కానీ ఆ సినిమా నేను చేయట్లేదని శర్వానంద్ తెలిపాడు. సినిమా అనౌన్స్ చేసారు కానీ అప్పట్నుంచి దాని గురించి మళ్ళీ ప్రకటన లేదు.
ఇటీవల దిల్ రాజు ఆర్య 3 టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించాడు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఆర్య 3 టైటిల్ రిజిస్టర్ చేయించారు. అసలు బన్నీ, సుకుమార్ ఇప్పుడు ఆర్య సినిమాకు మరో సీక్వెల్ చేసే పరిస్థితిలో లేరు. బన్నీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవేళ చేసినా సుకుమార్ తో పుష్ప 3 ఉంది. కాబట్టి ఆర్య 3 ఈ ఇద్దరి కాంబోలో రాదనే తెలుస్తుంది.
Also Read : Amardeep – Tejaswini Gowda : అమర్ దీప్ – తేజస్విని లవ్ స్టోరీ గురించి తెలుసా? అసలు లవ్ ప్రపోజల్ లేకుండానే..
కానీ ఈ రెండు సినిమాలు దిల్ రాజు తెరకెక్కిస్తాడని సమాచారం. సుకుమార్ పర్యవేక్షణలో వేరే డైరెక్టర్ తో దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా ఆర్య 3 సినిమా తెరకెక్కిస్తారని టాక్ నడుస్తుంది. అలాగే శతమానం భవతి సీక్వెల్ సినిమా కూడా ఆశిష్ రెడ్డితోనే తీసే ప్లాన్ లో ఉన్నారట. శతమానం భవతి తీసిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలోనే ఈ సినిమా ఉండనుంది. మరి అసలు హీరోలను పక్కనపెట్టి ఆశిష్ రెడ్డితో ఈ సినిమాలు తీస్తే వర్కౌట్ అవుతాయా? ఆ సినిమాల ఫ్యాన్స్ ఏమంటారో చూడాలి.
ఆశిష్ రెడ్డి ఇప్పటికే రౌడీ బాయ్స్, లవ్ మీ ఇఫ్ యు డేర్ సినిమాలతో మెప్పించాడు. త్వరలో సెల్ఫిష్ సినిమాతో రాబోతున్నాడు.