Amardeep – Tejaswini Gowda : అమర్ దీప్ – తేజస్విని లవ్ స్టోరీ గురించి తెలుసా? అసలు లవ్ ప్రపోజల్ లేకుండానే..
నటి తేజస్విని గౌడ ఆహా ఓటీటీలో వస్తున్న కాకమ్మ కథలు ఇంటర్వ్యూ ప్రోగ్రాంకి రాగా అమర్ దీప్ తో లవ్, పెళ్లి గురించి తెలిపింది.

Tejaswini Gowda tells about her Love Story with Amardeep Chowdary
Amardeep – Tejaswini Gowda : సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న అమర్ దీప్ – తేజస్విని గౌడ రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి ఇద్దరూ టీవీ షోలు, సీరియల్స్ తో బిజీగానే ఉన్నారు. తాజాగా నటి తేజస్విని గౌడ ఆహా ఓటీటీలో వస్తున్న కాకమ్మ కథలు ఇంటర్వ్యూ ప్రోగ్రాంకి రాగా అమర్ దీప్ తో లవ్, పెళ్లి గురించి తెలిపింది.
తేజస్విని గౌడ మాట్లాడుతూ.. కోయిలమ్మ సీరియల్ సమయంలో ఒక ఫోటోషూట్ లో మొదటిసారి కలిసాం. అమర్ నా దగ్గరికి వచ్చి కలుస్తూ ఉంటాం కదా అని ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత చాట్, కాల్ చేసేవాడు. అనంతరం ఈవెంట్స్, షోస్ లో కలుస్తూ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం. ఎప్పుడూ లవ్ టాపిక్ రాలేదు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక నా దగ్గరకు వచ్చి డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజ్ చేసాడు. నాకు సడెన్ సర్ ప్రైజ్ అది. అప్పటిదాకా అసలు అమర్ గురించి అలా ఆలోచించలేదు. ఆ మ్యారేజే ప్రపోజల్ తర్వాతే కొంత టైం తీసుకొని ఓకే చెప్పాను అని తెలిపింది.
Also Read : Maanas : బిగ్ బాస్ ఫేమ్, నటుడు మానస్ ఆస్తులు, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
అలా అసలు లవ్ ప్రపోజల్, లవ్ ట్రావెలింగ్ లేకుండా డైరెక్ట్ అమర్ మ్యారేజ్ ప్రపోజల్ తో పెళ్లి చేసేసుకున్నాం అని తెలిపింది తేజస్విని.