Maanas : చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలయ్యతో ఫస్ట్ సినిమా.. మహేష్ సినిమాలో.. చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు.. మానస్ గురించి ఈ విషయాలు తెలుసా?
తాజాగా తన చైల్డ్ ఆర్టిస్ట్ విషయాల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

Do You Know Bigg Boss Fame Maanas acted with Balakrishna as Child Artist and Gets Nandi Awards
Maanas : చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు పెద్దయ్యాక కూడా నటన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వారిలో మానస్ కూడా ఒకరు. ఇప్పుడు సీరియల్స్, బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్నాడు కానీ మానస్ గతంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించాడు. తాజాగా తన చైల్డ్ ఆర్టిస్ట్ విషయాల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
మానస్ మాట్లాడుతూ.. నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలకృష్ణ గారి నరసింహ నాయుడు సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాను. సింహాచలంలో ఆ సినిమా షూట్ జరుగుతుంది. అక్కడ చైల్డ్ ఆర్టిస్టులు కావాలి అని వైజాగ్ లో వెతికారు. అప్పటికే వైజాగ్ లో నేను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఫేమస్. దాంతో నా రిఫరెన్స్ వెళ్ళింది. అలా ఆ సినిమాకు సెలెక్ట్ అయ్యాను. మొదటి రోజే బాలయ్య, విశ్వనాధ్ గారితో సీన్. బాలయ్య ఫైట్ చేస్తున్నారు. ఆ ఫైట్ చూసి భయం వేసింది. కానీ ఆ రోజు షూట్ తర్వాత అక్కడ్నుంచి సినిమా మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో నేను ఇంకా ఫేమస్ అయ్యాను.
మహేష్ బాబు గారితో అర్జున్ సినిమా చేశాను. అప్పుడు నేను 7th క్లాస్ లో ఉన్నా. ఆ పాత్రకు పదిమంది ఆడిషన్స్ కి వచ్చారు. అదే రోజు ఆడిషన్ ఇవ్వగానే మధ్యాహ్నం షూట్. నేను సెలెక్ట్ అవ్వననుకున్నాను కానీ నన్ను ఫైనల్ చేసారు. షూట్ లో అందరి ముందు పెద్ద డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పాను. తనికెళ్ళ భరణి గారు చప్పట్లు కొట్టి అభినందించారు. ఆ తర్వాత అనేక సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాను.
హీరో సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా తీసుకున్నాను. వైఎస్సార్ గారి చేతుల మీదుగా ఆ అవార్డు తీసుకున్నాను. అప్పుడు మా క్లాస్మేట్స్ అంతా ఆ ఫంక్షన్ కి వచ్చారు. అమర్ దీప్, నేను ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అమర్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసాడు. మేమిద్దరం కలిసి ఓ చైల్డ్ సినిమాలో నటించాము అని బిగ్ బాస్, సీరియల్ ఫేమ్ అమర్ దీప్ గురించి కూడా తెలిపాడు.
Also Read : Maanas : బిగ్ బాస్ ఫేమ్, నటుడు మానస్ ఆస్తులు, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?