Anchor Ravi : ఆర్మీ ఆఫీసర్ అవ్వాల్సింది యాంకర్ అయ్యాడు.. ఆర్మీ ట్రైనింగ్ లో జాయిన్ అయ్యాక.. యాంకర్ రవి కథేంటో తెలుసా?

రవి యాంకర్ అవ్వకముందు ఏం చేయాలనుకున్నాడో తెలిపాడు.

Anchor Ravi : ఆర్మీ ఆఫీసర్ అవ్వాల్సింది యాంకర్ అయ్యాడు.. ఆర్మీ ట్రైనింగ్ లో జాయిన్ అయ్యాక.. యాంకర్ రవి కథేంటో తెలుసా?

Do You Know Anchor Ravi went to Army Training but how Turned as Anchor

Updated On : June 1, 2025 / 2:59 PM IST

Anchor Ravi : యాంకర్ గా రవి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు టీవీ షోలతో ఫేమ్ తెచ్చుకున్న రవి బిగ్ బాస్ లో కూడా పాల్గొన్నాడు. ప్రస్తుతం టీవీ షోలు, యూట్యూబ్ తో బిజీగానే ఉన్నాడు. తాజాగా ఆహా ఓటీటీ నిర్వహిస్తున్న కాకమ్మ కథలు షోకి గెస్ట్ గా వచ్చిన రవి యాంకర్ అవ్వకముందు ఏం చేయాలనుకున్నాడో తెలిపాడు.

యాంకర్ రవి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి నేషన్ ఫస్ట్, ఇండియా అని నాన్న నాకు బాగా ఎక్కించారు. మారేడుపల్లి వద్ద ఉండే ఆర్మీ ఆఫీస్ లకు, అక్కడి ఆర్మీ వాళ్ళ ఇళ్లకు తీసుకెళ్లవాళ్లు. దాంతో నేను కూడా పెద్ద ఆర్మీ ఆఫీసర్ అవ్వాలి అనుకున్నా. ఇంటర్ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ చేశా. NDA క్లియర్ చేశా. ఆ తర్వాత ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం జరిగే SSB ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేశా. పూణేలో ఆర్మీ ట్రైనింగ్ కి వెళ్ళాను. అక్కడ జ్వరం వచ్చినా పట్టించుకోరు. ఒక రెండేళ్ల తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మా నానమ్మ, మా అమ్మ చూపించిన ప్రేమకు నేను ఏడ్చేసి ఇంక ఆర్మీకి వెళ్ళను అని గట్టిగా చెప్పా. మా నాన్న డబ్బులు కట్టేసా అని చెప్పినా వినలేదు.

Also Read : Maanas : బిగ్ బాస్ ఫేమ్, నటుడు మానస్ ఆస్తులు, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఆ తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యా. అక్కడ నిత్య కలిసింది. ఒకే క్లాస్. ఆ తర్వాత మా లవ్, పెళ్లి జరిగాయి. కానీ అప్పుడు ఆర్మీ వద్దని ఆగిపోయాను. ధైర్యం చేసి ముందుకెళ్తే బాగుండేది అని అనిపిస్తుంది. చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడ్ని, అది మధ్యలో వదిలేసా. ఆ తర్వాత ఆర్మీ కూడా మధ్యలో వదిలేసా అని తెలిపాడు. ఇంజనీరింగ్ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి వచ్చాను అని తెలిపాడు.