Pawan Kalyan congratulates chiranjeevi to getting Indian film personality of the year
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అన్నయ్య చిరంజీవికి అభినందనలు తెలియజేశాడు. భారత 53వ చలన చిత్రోత్సవం వేడుకలు ఆదివారం గోవాలో ఘనంగా మొదలయ్యాయి.ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 28 వరకు కొనసాగనుంది. ఈ సెలెబ్రేషన్స్ కి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హాజరయ్యారు.
Chiranjeevi : పవన్ రాజకీయాలకు తగినవాడు.. పాలిటిక్స్ గురించి మరోసారి మాట్లాడిన చిరంజీవి..
ఇక ఈ 53వ చలన చిత్రోత్సవంలో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో 150 పైగా సినిమాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవిని 2022 గాను “ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్”గా ప్రకటించింది. ఈ క్రమంలోనే పవన్.. తనతో పాటు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం నిలుస్తున్న అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశాడు.
“అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవి గారికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను. భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం” అంటూ వ్యాఖ్యానించాడు. కాగా నిన్న చిరంజీవి తన కాలేజీ ‘గెట్ టు గెథెర్’ ప్రోగ్రామ్ లో “పవన్ రాజకీయాలకు తగినవాడు” అంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
అన్నయ్య చిరంజీవి @KChiruTweets గారికి హృదయపూర్వక అభినందనలు – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/DcSQBaDNZe
— JanaSena Party (@JanaSenaParty) November 20, 2022