Pawan Kalyan : అప్పుడు ట్రోల్స్.. మూడు నెలల్లో ఫిట్నెస్ బాడీతో, స్టైలిష్ లుక్స్ తో కౌంటర్.. పవన్ డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ లో బాడీ ఫిట్నెస్, స్టైల్ మెయింటైన్ చేసేవాళ్ళల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ స్టైల్ ని ఎంతోమంది యూత్ ఫాలో అయ్యేవాళ్ళు.

Pawan Kalyan : అప్పుడు ట్రోల్స్.. మూడు నెలల్లో ఫిట్నెస్ బాడీతో, స్టైలిష్ లుక్స్ తో కౌంటర్.. పవన్ డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా?

Pawan Kalyan Counter to Trolls on his Body with Fitness for OG and Ustaad Bhagat Singh

Updated On : June 11, 2025 / 4:26 PM IST

Pawan Kalyan : పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బాడీ ఫిట్నెస్, స్టైల్ మెయింటైన్ చేసేవాళ్ళల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ స్టైల్ ని ఎంతోమంది యూత్ ఫాలో అయ్యేవాళ్ళు. గతంలో అనేక సినిమాల్లో పవన్ తన బాడీ ఫిట్నెస్ చూపించాడు. కానీ ఇదంతా సినిమాల్లో ఉన్నప్పుడు. రాజకీయాల్లోకి వచ్చాక టైం లేకో, సినిమాలు గ్యాప్ ఇచ్చారనో.. పలు కారణాలతో పవన్ ఫిట్నెస్ మీద శ్రద్ద తగ్గించేశారు.

ఇటీవల పవన్ ట్రోలింగ్ కి గురయ్యారు. ఫిబ్రవరిలో పవన్ కుంభమేళాకు వెళ్ళినప్పుడు అక్కడ స్నానమాచరించగా పవన్ ఫొటోలు వైరల్ గా మారాయి. అందులో పవన్ పొట్ట పెరిగి, కాస్త లావు అయ్యి కనిపించాడు. దీంతో వేరే హీరోల అభిమానులు, పవన్ వ్యతిరేకులు పవన్ కళ్యాణ్ బాడీ మీద ట్రోల్స్ చేస్తూ ఇలాంటి బాడీ పెట్టుకొని హీరోగా చేస్తారా అంటూ విమర్శలు కూడా చేసారు.

Also Read : Akkineni Family : అఖిల్ రిసెప్షన్.. ‘అక్కినేని ఫ్యామిలీ’ ఫుల్ ఫోటో వైరల్.. ఫొటోలో ఎవరెవరు ఉన్నారంటే..

అప్పుడే పవన్ ఫ్యాన్స్.. పవన్ పాత సినిమాల ఫిట్నెస్ చూపించి కౌంటర్ ఇచ్చారు. పవన్ సినిమాలు చేయకే ఫిట్నెస్ మీద దృష్టి పెట్టడం లేదని అన్నారు. అయితే ఆ ట్రోల్స్ పై పవన్ స్పందించలేదు కానీ తాజాగా ఆ ట్రోల్స్ అన్నిటికి తన ఫిట్నెస్ తోనే గట్టి కౌంటర్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం పవన్ ఓ సెలూన్ షాప్ ఓపెనింగ్ కి షార్ట్, టైట్ టీ షర్ట్ వేసుకెళ్లాడు. ఆ డ్రెస్ లో పవన్ బాడీ ఫిట్ గా తయారైందని ఈజీగా తెలిసిపోతుంది. అలాగే పవన్ కాస్త బరువు కూడా తగ్గాడని తెలుస్తుంది.

ఇక నేడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో జాయిన్ అయ్యాడంటూ ఓ వీడియో రిలీజ్ చేసారు. ఈ వీడియోలో కూడా పవన్ స్టైలిష్ లుక్ లో, మంచి ఫిట్నెస్ తో కనపడ్డారు. దీంతో ఫ్యాన్స్ కూడా పవన్ ఫిట్నెస్ కి ఆశ్చర్యపోతున్నారు. రెండు రోజుల గ్యాప్ లో ఇలా పవన్ ఫిట్నెస్ బాడీతో కనిపించడంతో ఆ ట్రోల్స్ అన్నిటికి సమాధానం చెప్పాడని ఫ్యాన్స్ అంటున్నారు. వరుసగా సినిమా షూట్స్ చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఫిట్నెస్ మెయింటైన్ చేసాడని అంటున్నారు. అయితే కేవలం 3 నెలల్లోనే ఇంత ఫిట్నెస్ ఏంటి? అంత పొట్ట ఎలా తగ్గించేశారు ఇంత తక్కువ సమయంలో అని ఆశ్చర్యపోతున్నారు కూడా.

Also Read : Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వచ్చేసాడు.. షూటింగ్ వీడియో రిలీజ్.. బ్యాక్ టు బ్యాక్ షూట్స్ పూర్తి చేస్తున్న పవన్..

పవన్ సన్నిహితుల సమాచారం మేరకు పవన్ షూటింగ్స్ కి ఓకే చెప్పిన తర్వాత మూడు నెలల నుంచి కేవలం రోజుకు ఒక్కసారే మధ్యాహ్నం పూట మితంగా అన్నం తింటున్నారట. ఉదయం రెండు సార్లు బ్లాక్ కాఫీ, రాత్రికి ఫ్రూట్ జ్యూస్, లేదా మజ్జిగ తీసుకుంటున్నారని, ఇలా ఫుడ్ కంట్రోల్ పెడుతూనే ఎక్సర్ సైజ్ చేస్తున్నారని తెలుస్తుంది. మొత్తానికి పవన్ మళ్ళీ పాత స్టైలిష్ లుక్ లోకి రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పవన్ OG, ఉస్తాద్ గబ్బర్ సింగ్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.