Pawan Kalyan
HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడో కరోనా ముందు మొదలయింది. కరోనా సమయంలో సినిమాని ప్రకటించారు. మొదలయి 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా సినిమా రిలీజ్ అవ్వట్లేదు. పవన్ రాజకీయాల్లో బిజీ ఉండటంతో షూటింగ్ కి డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. దీంతో మూవీ రిలీజ్ అని డేట్ అనౌన్స్ చేసినప్పుడల్లా, రూమర్స్ వచ్చినప్పుడల్లా సినిమా వస్తుంది అనుకుంటారు కానీ చివరికి మళ్ళీ వాయిదా పడుతుంది.
ఇప్పటికి అలా చాలా సార్లు సినిమా వాయిదా పడింది. అయితే ఈ విషయంలో కూడా పవన్ రికార్డ్ కొట్టాడు అని ఫ్యాన్స్ అంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా కరోనా ముందే మొదలయింది. కరోనా సమయంలో సినిమా అధికారికంగా అనౌన్స్ చేసి, గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.
Also Read : Anand Sai : నా కోసం పవన్ కళ్యాణ్ మా నాన్న దగ్గరకు వెళ్లి.. పవన్ బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ సాయి..
హరిహర వీరమల్లు సినిమా మొదట 2022 జనవరిలో సంక్రాంతికి వస్తుందన్నారు. ఆ తర్వాత 2022 ఏప్రిల్ 29 సినిమా రిలీజ్ చేస్తామని డేట్ కూడా ఇచ్చారు. కానీ అప్పటికి షూటింగ్ అవ్వక వాయిదా వేశారు. ఆ తర్వాత 2022 అక్టోబర్ 5 అన్నారు. అది కూడా వాయిదా పడింది. ఆ తర్వాత 2023 జనవరి సంక్రాంతికి అన్నారు. అప్పుడు కూడా వాయిదా పడింది. 30 మార్చ్ 2023 అని రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ రిలీజ్ అవ్వలేదు. 2023 దసరాకి వస్తుందన్నారు రాలేదు. 2024 సమ్మర్ కి వస్తుంది అన్నారు అయినా రాలేదు. 2024 డిసెంబర్ లో వస్తుంది అని హడావిడి చేశారు, షూటింగ్ కూడా కొన్ని డేస్ ఫాస్ట్ గా జరిగింది అయినా రిలీజ్ అవ్వలేదు.
అప్పట్నుంచి షూటింగ్ కొన్ని రోజులు రెగ్యులర్ గా జరగడంతో ఫ్యాన్స్ ఈ సారి సినిమా వస్తుంది అనుకున్నారు. 26 జనవరి 2025 డేట్ అనౌన్స్ చేశారు కానీ రిలీజ్ అవ్వలేదు. 28 మార్చ్ 2025 పక్కా అన్నారు. సాంగ్స్ రిలీజ్ చేశారు, హడావిడి చేశారు కానీ ఆ డేట్ కూడా వెళ్ళిపోయింది. ఇటీవల గ్రాఫిక్స్, VFX వర్క్స్ జరుగుతున్నాయి. మే 9 రిలీజ్ పక్కా అని పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంకో 20 రోజులే ఉంది ఆ డేట్ కి, ఇంకా షూట్ మిగిలి ఉందట. ప్రమోషన్స్ కూడా మొదలు లేదు. మే 9 వేరే సినిమాలు కూడా అనౌన్స్ చేసుకుంటున్నారు. దీంతో ఈ డేట్ కి కూడా హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వదు అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
Also Read : Rana Daggubati : WWE లో రానా.. సరికొత్త రికార్డ్.. ఫోటోలు, వీడియోలు వైరల్..
అలా ఇప్పటిదాకా హరిహర వీరమల్లు సినిమా 10 సార్లు వాయిదా పడగా ఇప్పుడు 11 వ సారి వాయిదా పడటానికి రెడీగా ఉంది. అలా సినిమాలు వాయిదా పడటంలో కూడా పవన్ రికార్డ్ సృష్టిస్తున్నాడు అని ఫ్యాన్స్ అంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా 11 సార్లు వాయిదా పడి కొత్త రికార్డ్ సెట్ చేసాడు, ఇంకెన్ని సార్లు ఈ సినిమాని వాయిదా వేస్తారో అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.
మొదట్లో పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా, మొఘల్స్ కాలం నాటి సినిమా, యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయి, పవన్ రాబిన్ హుడ్ లాంటి పాత్ర చేస్తున్నాడు అని అంచనాలు పెంచారు. మొదట్లో రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై భారీ హైప్ పెరిగింది. కానీ ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో మెల్లిమెల్లిగా సినిమా మీద ఆసక్తి తగ్గుతుంది అంటున్నారు ఫ్యాన్స్. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడో, ఎప్పుడు హరిహర వీరమల్లు షూట్ జరుగుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.