Rana Daggubati : WWE లో రానా.. సరికొత్త రికార్డ్.. ఫోటోలు, వీడియోలు వైరల్..
నెట్ ఫ్లిక్స్ తరపున రానా నాయుడు సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా రానా అక్కడికి వెళ్ళాడు.

Rana Daggubati went to WWE WrestleMania 41 Netflix Shares Photos
Rana Daggubati : రానా దగ్గుబాటి ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో పాటు తన బిజినెస్ లతో బిజీగా ఉన్నాడు. తాజాగా రానా WWE ఫేమ్ రెజ్లింగ్ మానియాలో కనిపించాడు. రెజ్లింగ్ మానియా పోటీలను చూడటానికి రానా వెళ్ళాడు. నెట్ ఫ్లిక్స్ తరపున రానా నాయుడు సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా రానా అక్కడికి వెళ్ళాడు.
అక్కడ రానా దిగిన పలు ఫోటోలను నెట్ ఫ్లిక్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ రెజ్లింగ్ మానియా లైవ్ లో చూడటానికి వెళ్లిన మొదటి ఇండియన్ సినిమా సెలబ్రిటీగా రానా సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు.
ఇక్కడికి వెళ్లడంపై రానా మాట్లాడుతూ.. ఇది ఒక అద్భుతమైన అనుభవం. చిన్నప్పుడు WWE మా లైఫ్ లో ఒక భాగం. ఇప్పుడు అది లైవ్ లో చూడటం ఆనందంగా ఉంది. రానా నాయుడు, WWE రెండూ నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి అని తెలిపారు. దీంతో ఇండియన్ WWE ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.