Singer Pravasthi : పాడుతా తీయగా షోపై, జడ్జిలపై సింగర్ ప్రవస్థి సంచలన వ్యాఖ్యలు.. ఎక్స్‌పోజింగ్ చేయమన్నారు, బాడీ షేమింగ్ చేశారు..

తాజాగా పాడుతా తీయగా షోపై సింగర్ ప్రవస్థి సంచలన వ్యాఖ్యలు చేసింది.

Singer Pravasthi : పాడుతా తీయగా షోపై, జడ్జిలపై సింగర్ ప్రవస్థి సంచలన వ్యాఖ్యలు.. ఎక్స్‌పోజింగ్ చేయమన్నారు, బాడీ షేమింగ్ చేశారు..

Singer Pravasthi Sensational Comments on Padutha Theeyaga Show

Updated On : April 21, 2025 / 2:09 PM IST

Singer Pravasthi : తెలుగు సింగింగ్ షోలలో పాడుతా తీయగా ఒక గొప్ప షో. దివంగత లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం హోస్ట్ గా ఎన్నో సీజన్లు నడిపించారు. ఈ షో ద్వారా ఎంతోమంది ట్యాలెంటెడ్ సింగర్స్ సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఎన్ని సింగింగ్ షోలు వచ్చినా పాడుతా తీయగా మాత్రం ప్రజల మనుసులో నిలిచిపోయింది. ఇప్పటికి చాలా మంది పెద్దవాళ్ళు రెగ్యులర్ గా పాడుతా తీయగా షో చూస్తారు.

అయితే బాలసుబ్రహ్మణ్యం గారు మరణించిన తర్వాత ఆ షో వేరే ప్రొడక్షన్ చేతికి వెళ్లడం, హోస్ట్ గా SP బాలు కుమారుడు SP చరణ్ రావడం జరిగాయి. ఇప్పుడు కూడా పాడుతా తీయగా నడుస్తుంది. ప్రస్తుతం పాడుతా తీయగా 25వ సీజన్ టెలికాస్ట్ అవుతుంది. ఇన్ని రోజులు ఈ సీజన్ లో కూడా ప్రవస్థి షోలో పాల్గొంది. అయితే తాజాగా ఈ షోపై సింగర్ ప్రవస్థి సంచలన వ్యాఖ్యలు చేసింది.

Also Read : Tollywood Movies : నిన్న విజయశాంతి, మొన్న నాగవంశీ.. అసలు సినిమాలను ఎవరు తొక్కేస్తున్నారు? వీళ్ళు అంటున్నది ఎవర్ని?

చిన్నప్పట్నుంచీ పాటల షోలలో పాల్గొంటూ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది ప్రవస్థి. చైల్డ్ సింగర్ గా SP బాలు, సుశీల, జానకమ్మ, చిత్ర లాంటి లెజెండరీ సింగర్స్ దగ్గర్నుంచి కూడా అభినందనలు అందుకుంది. రెగ్యులర్ గా పలు సింగింగ్ షోలలో పాల్గొంటుంది. అయితే తాజాగా ప్రవస్థి తన యూట్యూబ్ లో పాడుతా తీయగా షోపై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.

ప్రవస్థి ఈ వీడియోలో మాట్లాడుతూ.. నాకు మ్యూజిక్ ఫీల్డ్ కి సంబంధం లేదని ఫిక్స్ అయ్యాకే ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది ఈ వీడియో ఆపడానికి చూసారు. నేను మెంటల్లీ చాలా ఎఫెక్ట్ అయ్యాను. జడ్జీలు నన్ను ఒక చీడపురుగులా చూసేవాళ్ళు. అసలు నేను ఎందుకూ పనికిరాను అన్నట్టు అనేవాళ్ళు. ఇలాంటి జడ్జీల నుంచి ఇది ఊహించలేదు. నా బాడీ మీద కూడా జోక్స్ వేశారు. నేను చాలా షోలు చేశాను కానీ ఎక్కడా ఇలా చూడలేదు. చాలా పెద్ద సింగర్స్ నన్ను పొగిడారు కానీ వీళ్ళు ఇలా అంటున్నారు. ప్రొడక్షన్ వాళ్ళు నన్ను చాలా తిప్పేవాళ్లు, ఎక్స్ పోజింగ్ చేయమనేవాళ్లు, చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకోమనేవారు. నేను చాలా ఇబ్బంది పడ్డాను అయినా పాడాను.

బాడీ షేమింగ్ చేసేవాళ్ళు. అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ అయితే ఇలాంటి బాడీకి నేను ఎలాంటి బట్టలు ఇస్తాను అని అన్నారు. ఈ షో వల్ల నేను మెంటల్లీ చాలా చాలా ఎఫెక్ట్ అయ్యాను. వీళ్ళు అనే మాటలకు కాన్ఫిడెన్స్ పోతుంది. SPB సర్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి కుళ్ళు జోకులు, కామెడీ, డ్యాన్సులు చేయడం లాంటివి లేదు. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. నేను చేసిన 2017 సీజన్ లో కూడా చాలా బాగుండేది. ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వచ్చారో అప్పట్నుంచే ఇలాంటివన్నీ. మమ్మల్ని డ్యాన్సులు చేయమని, కుళ్ళు జోకులు చెప్పమని చేస్తున్నారు. నన్ను డ్యాన్స్ చేయమని బలవంత పెట్టారు.

సునీత గారు నేను స్టేజి మీదకు రాగానే ఎందుకూ వచ్చింది అన్నట్టు ఫేస్ పెట్టేవాళ్ళు. నేను సరిగ్గా పాడలేను అని ఆవిడే పక్కన కీరవాణి సర్ కి చెప్తారు. చంద్రబోస్ గారి లిరిక్స్ తప్పు లేదని చెప్పినా ఆలోచించి లేని నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్పారు. కీరవాణి గారు ఆయన పాడిన పాటలు పాడితే మాత్రం మంచి మార్క్స్ ఇస్తారు. నేను ఫైన్షియల్ సమస్యల వల్ల వెడ్డింగ్ షోలు చేసేదాన్ని. కానీ వెడ్డింగ్ షోలు చేసే వాళ్ళు అసలు సింగర్స్ కాదు అని అన్నారు. కీరవాణి గారు రోజు నాకు చాలా మంది వచ్చి చాకిరి చేసి వెళ్తారు. అలాంటి వాళ్లలో చేర్చుకుంటా అన్నారు. డైరెక్టర్, నిర్మాత ప్రవీణ, అనిల్ వాళ్లకు నచ్చిన కంటెస్టెంట్స్ కి నచ్చినట్టు సాంగ్స్ ఇచ్చుకున్నారు.

Also Read : Gymkhana : ‘ప్రేమలు’ హీరో నస్లీన్ నెక్స్ట్ సినిమా ట్రైలర్ వచ్చేసింది.. ‘జింఖానా’.. ఫుల్ ఫన్.. తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే?

నా కంటే సరిగ్గా పాడని వాళ్ళను కూడా మెచ్చుకున్నారు. పాట మర్చిపోయినా మెచ్చుకున్నారు వేరే వాళ్ళను. నా ఎలిమినేషన్ అప్పుడు కీరవాణి గారు, చంద్రబోస్ గారు వెళ్ళిపోయారు. సునీత గారు మాత్రం నా మీద గ్రడ్జ్ తో అలాగే ఉన్నారు. నేను ఎలిమేట్ అయినా స్మైల్ తోనే ఉన్నాను. మా అమ్మ ముందు నుంచి అన్ని చూస్తున్నారు కాబట్టి మా అమ్మ వెళ్లి సునీత గారిని వెళ్లి మా అమ్మాయికి ఎందుకూ అన్యాయం చేశారు అని అడిగితే నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నారు. నేను వేరే షోలలో కూడా ఎలిమినేట్ అయ్యాను కానీ ఇలాంటిది ఎక్కడా చూడలేదు.

నేను కెరీర్ వదిలేద్దామని డిసైడ్ అయ్యాను అందుకే ఇలా మాట్లాడుతున్నాను. పెద్ద పెద్ద పేర్లు చెప్పాను కాబట్టి నాకు ఛాన్సులు ఇవ్వరు. ఇలాంటి ఫ్రాడ్ షోలు చూడటం ఆపేయండి. చాలా మంది నాలాగా సఫర్ అయ్యారు. వాళ్ళు కెరీర్ కి భయపడి సైలెంట్ గా ఉన్నారు. జడ్జీలు సరస్వతి దేవిని అవమానించారు వీళ్ళు. నా దగ్గర డబ్బులు లేవు, ఎవరికీ గిఫ్ట్స్, డబ్బులు ఇవ్వలేను అందుకే నాకు ఛాన్సులు ఇవ్వరు, వచ్చిన ఛాన్సులు కూడా లాగేసుకున్నారు. నాకు ఏమైనా అయినా, నా ఫ్యామిలీకి ఏమైనా అయినా సునీత గారు, చంద్రబోస్ గారు, కీరవాణి గారు, జ్ఞాపిక ప్రొడక్షన్ అనిల్ కారణం అంటూ చెప్పింది.

Also See : Suriya – Jyotika : ఆలయాలు సందర్శించిన స్టార్ కపుల్ సూర్య – జ్యోతిక.. ఫొటోలు వైరల్..

దీంతో ఈ వీడియో టాలీవుడ్ లో సంచలనంగా మారింది. మరి దీనిపై పాడుతా తీయగా జడ్జీలు కీరవాణి, సునీత, చంద్రబోస్ కానీ హోస్ట్ SP చరణ్ కానీ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ కానీ స్పందిస్తారా చూడాలి.