Gymkhana : ‘ప్రేమలు’ హీరో నస్లీన్ నెక్స్ట్ సినిమా ట్రైలర్ వచ్చేసింది.. ‘జింఖానా’.. ఫుల్ ఫన్.. తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే?
మీరు కూడా జింఖానా తెలుగు ట్రైలర్ చూసేయండి..

Naslen Malayalam Movie Gymkhana Telugu Trailer Released
Gymkhana : ప్రేమలు సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న నస్లీన్ ఇటీవల నటించిన మలయాళం సినిమా జింఖానా. మలయాళంలో పెద్ద హిట్ అవ్వడంతో ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా జింఖానా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసారు.
మీరు కూడా జింఖానా తెలుగు ట్రైలర్ చూసేయండి..
ట్రైలర్ అంతా ప్రేమలు లాగే డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి. బాలకృష్ణ, వేణుస్వామి.. ఇలా ట్రెండింగ్ కి తగ్గట్టు డైలాగ్స్ ట్రైలర్ లోనే పెట్టారంటే సినిమాలో చాలా ఉంటాయని తెలుస్తుంది.
Also Read : Anchor Rashmi : సర్జరీ చేయించుకున్న ‘యాంకర్ రష్మీ’.. జనవరి నుంచి బాధపడుతూ.. హాస్పిటల్ నుంచి ఫోటో షేర్ చేసి..
మలయాళంలో ఏప్రిల్ 10న రిలీజ్ అయి ఇప్పటికే 25 కోట్లు కలెక్ట్ చేసిన జింఖానా తెలుగులో ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది. మరి ప్రేమలు సినిమా లాగే ఈ జింఖానా కూడా మెప్పిస్తుందా చూడాలి.