Tejaswini Gowda : భర్త వెళ్ళొచ్చాడు.. ఇప్పుడు భార్య కూడా..? ఆల్రెడీ ఆఫర్ వచ్చినా.. బిగ్ బాస్ కి వెళ్లడంపై తేజస్విని గౌడ కామెంట్స్..

తేజస్వినికి కూడా బిగ్ బాస్ కి వెళ్లే ఛాన్స్ వచ్చిందట.

Tejaswini Gowda : భర్త వెళ్ళొచ్చాడు.. ఇప్పుడు భార్య కూడా..? ఆల్రెడీ ఆఫర్ వచ్చినా.. బిగ్ బాస్ కి వెళ్లడంపై తేజస్విని గౌడ కామెంట్స్..

Amardeep Chowdary wife Tejaswini Gowda gives Clarity on her Bigg Boss Entry

Updated On : April 20, 2025 / 3:18 PM IST

Tejaswini Gowda : పలు సీరియల్స్, టీవీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి తేజస్విని గౌడ. 2022 లో నటుడు, బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఇటీవల సీరియల్ నటులు చాలా మంది బిగ్ బాస్ లో పాల్గొంటున్నారు. అమర్ దీప్ గతంలో బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొని రన్నరప్ గా నిలిచాడు.

అయితే తేజస్వినికి కూడా బిగ్ బాస్ కి వెళ్లే ఛాన్స్ వచ్చిందట. త్వరలో రాబోయే సీజన్ కి కూడా వెళ్లనుంది అని వార్తలు వస్తున్నాయి. తాజాగా తేజస్విని గౌడ ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ కి వెళ్లడంపై క్లారిటీ ఇచ్చింది.

Also Read : Anchor Rashmi : సర్జరీ చేయించుకున్న ‘యాంకర్ రష్మీ’.. జనవరి నుంచి బాధపడుతూ.. హాస్పిటల్ నుంచి ఫోటో షేర్ చేసి..

తేజస్విని మాట్లాడుతూ.. నాకు లాస్ట్ టైం కూడా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. మీటింగ్ కి కూడా వెళ్లి వచ్చాను. అంతకుముందు వెళ్దాం అనుకున్నా కానీ అమర్ బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన తర్వాత నుంచి మాత్రం అంతగా ఇంట్రెస్ట్ లేదు. అమర్ వెళ్ళినప్పుడు కూడా నన్ను అడిగారు. అప్పుడు నాకు సీరియల్స్ ఉన్నాయి అందుకే వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేదు. ఈ ఇయర్ అయితే వెళ్లట్లేదు. కానీ ఖచ్చితంగా వెళ్తాను ఒక రెండు మూడేళ్ళ తర్వాత అని తెలిపింది.

Also Read : Tejaswini Gowda – Amardeep Chowdary : అమర్ దీప్ తో విడాకులపై క్లారిటీ ఇచ్చిన నటి తేజస్విని గౌడ్..