Anchor Rashmi : సర్జరీ చేయించుకున్న ‘యాంకర్ రష్మీ’.. జనవరి నుంచి బాధపడుతూ.. హాస్పిటల్ నుంచి ఫోటో షేర్ చేసి..

తాజాగా రష్మీ తనకు సర్జరీ జరిగింది అంటూ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Anchor Rashmi : సర్జరీ చేయించుకున్న ‘యాంకర్ రష్మీ’.. జనవరి నుంచి బాధపడుతూ.. హాస్పిటల్ నుంచి ఫోటో షేర్ చేసి..

Anchor Rashmi tells about her surgery and health issues

Updated On : April 20, 2025 / 2:32 PM IST

Anchor Rashmi : యాంకర్ గా పాపులారిటీ తెచ్చుకునన్ రష్మీ గౌతమ్ ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ.. లాంటి పలు టీవీ షోలకు హోస్ట్ చేస్తూ, అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ అలరిస్తుంది. రష్మీ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా రష్మీ తనకు సర్జరీ జరిగింది అంటూ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Also Read : Tejaswini Gowda – Amardeep Chowdary : అమర్ దీప్ తో విడాకులపై క్లారిటీ ఇచ్చిన నటి తేజస్విని గౌడ్..

హాస్పిటల్ లో ఆపరేషన్ చేసేటప్పుడు వేసుకునే డ్రెస్ తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఇలాంటి సమయంలో నాకు తోడుగా నిలిచిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికి ధన్యవాదాలు. అయిదు రోజుల్లోనే నా శరీరంలో హిమోగ్లోబిన్ 9 శాతానికి పడిపోయింది. జనవరి నుంచి నాకు ఏం జరుగుతుందో అర్ధం కావట్లేదు. ఎక్కువగా రక్తస్రావం, తీవ్రమైన భుజం నొప్పితో బాధపడ్డాను. వైద్యులను సంప్రదిస్తే మొదట దేనికి ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా తెలియలేదు.

మార్చ్ నాటికి పూర్తిగా నీరసించిపోయాను. వర్క్ పరమైన కమిట్మెంట్స్ అన్ని పూర్తి చేసుకొని హాస్పిటల్ లో చేరాను. ఏప్రిల్ 18న సర్జరీ జరిగింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మరో మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలి. నేను షేర్ చేసిన ఫొటోలు ఒకటి సర్జరీకి ముందు ఒకటి సర్జరీ తర్వాత. బాడీలో ఫైబ్రాయిడ్స్ వల్లే ఇదంతా జరిగింది. వాటిని తీసివేశారు అని తెలిపింది. దీంతో రష్మీ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam)

 

Also Read : Siree Lella : హ్యాపీ బర్త్ డే పెద మామయ్య.. చంద్రబాబుకు స్పెషల్ విషెష్ చెప్పిన హీరోయిన్.. ఫోటో వైరల్..