Pawan Kalyan : డప్పు కొట్టి గిరిజనులతో కలిసి థింసా డ్యాన్స్ చేసిన పవన్.. పాట కూడా నేర్చుకొని.. ఫొటోలు, వీడియోలు వైరల్..

పవన్ కళ్యాణ్ అరకు ప్రాంత గిరిజన సంప్రదాయ నృత్యం థింసాను అక్కడి థింసా మహిళా నృత్య కళాకారులతో కలిసి చేశారు.

Pawan Kalyan Dhimsa Dance with Artists at Manyam District Photos goes Viral

Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత రెండు రోజులు మన్యం జిల్లాల్లోని పలు గ్రామాలు, మండలాలు సందర్శించారు. ఎన్నో ఏళ్లుగా రోడ్లు లేని గ్రామాలను రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేశారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అరకు ప్రాంత గిరిజన సంప్రదాయ నృత్యం థింసాను అక్కడి థింసా మహిళా నృత్య కళాకారులతో కలిసి చేశారు.

అనంతరం గిరిజన ఆడబిడ్డల దగ్గర ఓ గిరిజన పాట నేర్చుకున్నారు. ఆ మహిళ పాడుతుంటే పవన్ కూడా పాడారు.

అలాగే అక్కడి డప్పు కళాకారుల దగ్గర డప్పుని కొట్టి సంతోషపరిచారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక రోడ్లు కూడా లేని గ్రామాల్లోకి వర్షం పడుతున్నా బురదలో నడుచుకుంటూ వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ అక్కడి గ్రామాల్లోని ప్రజలతో మాట్లాడి గిరిజన గ్రామాల అభివృద్ధికి కార్యక్రమాలు చేపట్టడంతో అక్కడి ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ని అభినందించారు.