Pawan Kalyan : అకీరా బర్త్ డే రోజు రేణుదేశాయ్‌ని బాధ పెట్టిన పవన్ ఫ్యాన్స్.. మరి అలాంటి కామెంట్స్?

నిన్న (ఏప్రిల్ 8) పవన్ కళ్యాణ్ అకీరా నందన్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. కాగా అకీరాకి బర్త్ డే విషెస్ చెప్పే క్రమంలో పవన్ అభిమానులు రేణుదేశాయ్ పై ఘాటు కామెంట్స్ చేశారు.

Pawan Kalyan fans viral comments Renu Desai

Pawan Kalyan : పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ (Renu Desai) విడిపోయిన సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరికి అధ్య, అకీరా నందన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్న విషయం కూడా అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరి విడాకులు తరువాత రేణు దేశాయ్ పిల్లలతో కలిసి ఉంటుంది. కాగా పవన్ అభిమానులు అకీరా నందన్ పై కూడా తన వీరాభిమానిని చూపిస్తుంటారు. ఇక నిన్న (ఏప్రిల్ 8) అకీరా పుట్టినరోజు కావడంతో నాగబాబు, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లతో పాటు పవన్ అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా తన బర్త్ డే విషెస్ తెలియజేశారు.

Allu Arjun: పుష్ప రాజ్ కాదు.. కేబుల్ రాజే టాప్ అంటోన్న ఐఎండీబీ

అయితే ఒక అభిమాని చేసిన పని మాత్రం రేణుదేశాయ్ ని తీవ్రంగా బాధ పెట్టింది. ఆ కామెంట్స్ ఏంటంటే.. మా అన్న కొడుకుని చూడాలని మాకు ఉంటుంది. మీరు తనని దాచిపెట్టకండి. అప్పుడప్పుడు వీడియో, ఫోటోల ద్వారా అయినా చూపిస్తూ ఉండండి అంటూ కామెంట్ చేశాడు. దీనికి రేణుదేశాయ్ బదులిస్తూ.. మీ అన్న కొడుకా? అకీరా నా కొడుకు. మీరు వీరాభిమాని అని తెలుస్తుంది. కానీ మాట్లాడడంలో కొంచెం పద్ధతి నేర్చుకోండి అంటూ రిప్లై ఇచ్చింది.

దీనికి మరో అభిమాని రిప్లై ఇస్తూ.. తెలుగు స్టేట్స్ లో మీరు ఎవరి కొడుకు అంటే తండ్రి పేరే చెబుతాం. అది మా కల్చర్ అంటూ శృతిమించిన సమాధానం ఇచ్చాడు. దానికి రేణుదేశాయ్.. మీకు జన్మనిచ్చిన అమ్మని అవమానించడం మీ కల్చర్ అంటున్నారా? అంటూ రిప్లై ఇచ్చింది. ఇలాగె మరి కొందరు కూడా కామెంట్స్ చేస్తుండగా రేణు దేశాయ్ వాటిని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేస్తూ తన బాధని వ్యక్తం చేసింది. ఇటువంటి కామెంట్స్ అండ్ పోస్ట్ లను నేను పట్టించుకోవడం మానేశాను. కానీ ఇవాళ అకీరా పుట్టినరోజున కూడా ఇలా నన్ను నిందిస్తూ కామెంట్లు చేయడం బాధిస్తుంది. 11 ఏళ్ళు అవుతుంది. నన్ను ఒక విలన్ గా ఎందుకు చూస్తున్నారో అర్ధం కావడం లేదు అంటూ బాధ పడింది.

Pawan Kalyan fans viral comments Renu Desai

Pawan Kalyan fans viral comments Renu Desai

Pawan Kalyan fans viral comments Renu Desai

Pawan Kalyan fans viral comments Renu Desai