Pawan Kalyan gives Clarity on Ticket Rates in Game Changer Pre Release Event
Pawan Kalyan : నేడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరగ్గా పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్లో సినిమా గురించి చరణ్ గురించి, చిరంజీవి గురించి మాట్లాడారు. అనంతరం టికెట్ రేట్ల పెంపు గురించి మాట్లాడారు.
టికెట్ రేట్ల పెంపు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి అని అడుగుతారు. ఇది డిమాండ్ అండ్ సప్లై. నేను శంకర్ గారి సినిమాని బ్లాక్ లో కొనుక్కొని చూసాను. అది నా సరదా. ఆ బ్లాక్ డబ్బులు ఎవరికో వెళ్తాయి. ఇష్టమైన హీరో సినిమా మొదటిరోజు చూడాలి అనుకుంటారు. బడ్జెట్లు పెరిగాయి. మార్కెట్ పెరిగింది. పెరిగిన ప్రతి రేటుకు 18 శాతం ట్యాక్స్ వస్తుంది గవర్నమెంట్ కి. నా సినిమాకు టికెట్ రేట్లు తగ్గించారు. చాలా మంది హీరోలెవరు కూటమికి మద్దతు పలకలేదు. అయినా మేము అందరి హీరోలకు సపోర్ట్ చేస్తున్నాము. సినిమాలకు రాజకీయాలు పూలమొద్దు. టికెట్ రేట్ల కోసం హీరోలు రావొద్దు. హీరోలు ఎందుకు రావాలి. నిర్మాతలు, బిజినెస్ చేసేవాళ్ళు రండి. హీరోలు వచ్చి నమస్కారాలు పెట్టవసర్లేదు. సీఎం చంద్రబాబు గారు తెలుగు పరిశ్రమను ఎప్పుడూ ఇబ్బందిపెట్టలేదు. ఈ రోజు పెరిగిన టికెట్ రేట్లు ఏపీ ప్రభుత్వానికి కూడా ఆదాయం. ట్యాక్స్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి ప్రతి రూపాయి లోంచి 18 శాతం ఆదాయం వస్తుంది అని అన్నారు.