Pawan Kalyan : తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్.. పవన్ స్పీచ్ అదిరిందిగా.. చరణ్ గురించి గొప్పగా..
ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..

Pawan Kalyan Interesting Comments on Ram Charan and Chiranjeevi
Pawan Kalyan : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు రాజమండ్రిలో ఘనంగా జరిగింది. ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. బాబాయ్ – అబ్బాయి రావడంతో ఈవెంట్ కు భారీగా మెగా ఫ్యాన్స్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ తో సినిమాపై భారీ హైప్ నెలకొంది.
Also Read : Ram Charan : ఇండియన్ పాలిటిక్స్ లో రియల్ గేమ్ ఛేంజర్ పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్ కామెంట్స్..
ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మాలో ఎంతమంది హీరోలు వచ్చినా వాటికి మూలం మెగాస్టార్. ఇవాళ గేమ్ ఛేంజర్, OG అయినా ఇదంతా మొగల్తూరులో మొదలయింది. మీరు ఇవాళ మమ్మల్ని ఎలా పిలిచినా అన్నిటికి ఆయనే ఆద్యుడు. మూలాలు మర్చిపోకూడదు. చాలా తక్కువ సినిమాలకు థియేటర్ కి వెళ్ళేవాడిని. యాక్టర్ కూడా అవ్వకముందు శంకర్ గారి సినిమాని బ్లాక్ లో టికెట్ కొనుక్కొని జెంటిల్మెన్ సినిమాకు చెన్నైలో వెళ్ళాను. ప్రేమికుడు సినిమాకు మా అమ్మమ్మతో వెళ్ళాను. ఆయన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ తో పాటు సోషల్ మెసేజ్ లు ఉంటాయి. ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తుంది. శంకర్ గారి డబ్బింగ్ సినిమాలు ఇక్కడ బాగా ఆడాయి. నేను శంకర్ గారు డైరెక్ట్ తెలుగు సినిమా తీస్తే బాగుంటుంది అనుకునేవాడిని. ఇప్పుడు గేమ్ ఛేంజర్ తీయడం సంతోషంగా ఉంది.
నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు నా దగ్గర డబ్బులు లేనప్పుడు నాకు డబ్బులు ఇచ్చి వకీల్ సాబ్ సినిమా చేశారు. ఆ డబ్బే నాకు జనసేన పార్టీకి ఇంధనంగా పనిచేసింది. నేను ఇంటర్ చదివేటప్పుడు అన్నయ్యకు అబ్బాయి పుట్టాడు. మా ఇంట్లో హనుమంతుడి భక్తులు కాబట్టి రాముడి చరణాల కింద ఉంటాడు కాబట్టి రామ్ చరణ్ అని మా నాన్న గారు పెట్టారు. చిరంజీవి నాకు అన్నయ్య కాదు తండ్రి సమానులు. నాకు చరణ్ ఒక తమ్ముడు. చిన్నప్పుడు చరణ్ ని బాగా ఏడిపించేవాడిని. ఏడేళ్ల వయసులో హార్స్ రైడింగ్ నేర్చుకునేవాడు. నేను అప్పుడు బద్దకంగా ఉండేవాడిని. చరణ్ ని నేనే దింపేవాడిని హార్స్ రైడింగ్ దగ్గర. చరణ్ అద్భుతమైన డ్యాన్సర్. రంగస్థలం నటన చూసి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని అనిపించింది. భవిష్యత్తులో ఉత్తమ నటుడు అవార్డు అందుకుంటాడు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్. అన్నయ్య కష్టపడి రాత్రి వచ్చేసరికి నేను ఆయనకోసం ఎదురుచూసేవాడిని.
నానికి మా ఇంట్లో చాలా మంది అభిమానులు ఉన్నారు. అందరు హీరోల అభిమానులకు థ్యాంక్స్. అందరు హీరోలు బాగుండాలి అని కోరుకుంటాము. మగధీరలో చరణ్ నటన చూసి ఆశ్చర్యపోయాను. నేను హార్స్ రైడింగ్ గబ్బర్ సింగ్ అప్పుడు చేశాను. గుర్రం చెవిలో నాకు హార్స్ రైడింగ్ రాదు అని బతిమాలి దానికి ఫుడ్ పెట్టి రైడింగ్ చేశాను. ఆ సినిమా అయ్యేసరికి హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. చరణ్ ఇంగ్లాండ్ కి వెళ్లి డ్యాన్స్ నేర్చుకున్నాడు. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంది. ఈ సినిమా బాగా ఆడాలి అని అన్నారు.
Also Read : Game Changer : హిందీ బిగ్‌బాస్ లో ‘గేమ్ ఛేంజర్’.. రామ్ చరణ్, కియారా అద్వానీ ఆటలు.. ప్రోమో చూశారా?
దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో భారీగా ఈ సినిమా తెరకెక్కింది. SJ సూర్య, అంజలి, నవీన్ చంద్ర, కియారా అద్వానీ, శ్రీకాంత్, సునీల్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో భారీ హైప్ తెచ్చుకుంది.