Pawan Kalyan
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఏపీలో డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమా షూటింగ్ కి డేట్స్ ఇవ్వడమే కష్టం అలాంటిది ప్రమోషన్స్ కి అసలు ఛాన్స్ లేదు. కానీ హరిహర వీరమల్లు సినిమాకు గట్టిగానే ప్రమోషన్స్ చేసారు నిర్మాత కోసం. OG సినిమాకు కూడా రెండు రోజులు వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ ఈవెంట్ కి హాజరయ్యారు.
ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 26 రిలీజ్ కానుంది. ప్రభుత్వ కార్యక్రమాలతో బిజిగా ఉన్న పవన్ ప్రమోషన్స్ కి వస్తారా లేదా అనేది అందరికి సందేహమే. తాజాగా దీనికి సంబంధించి ఓ అప్డేట్ వినిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ కి రెండు రోజులు సమయం కేటాయించారట. ఈ రెండు రోజులలో ఒక రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. మరో రోజు పవన్ తో ఏదైనా కొత్తగా ప్రమోషన్ ప్లాన్ చేయాలని చూస్తున్నారట హరీష్ శంకర్. అలాగే ఈ రెండు రోజుల్లోనే మీడియాతో ఇంటరాక్షన్ కూడా ఉంటుందని టాక్ నడుస్తుంది.
OG ప్రమోషన్స్ లో పవన్ కనిపించిన తీరు, మాట్లాడిన తీరుకి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్ ఇప్పుడు ఉస్తాడా భగత్ సింగ్ ప్రమోషన్స్ కి వస్తున్నారని తెలియడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉస్తాద్ ప్రమోషన్స్ లో పవన్ ఎలాంటి లుక్స్ లో కనిపిస్తారో అని ఎదురుచూస్తున్నారు.
Also Read : Sivaji Raja : టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటుడు శివాజీ రాజాకి పితృ వియోగం..