Pawan Kalyan gives Janasena Formation Day Event work to Allu Arjun Friend Producer Bunny Vasu
Bunny Vasu : అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు ప్రస్తుతం గీత ఆర్ట్స్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. ఇటీవలే తండేల్ సినిమాతో భారీ హిట్ కొట్టారు. బన్నీ వాసు అల్లు కాంపౌండ్ లో ఉన్నా జనసేనలో కీలక పాత్ర పోషిస్తారు. గత ఎన్నికల సమయంలో బన్నీవాసు స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేసారు.
బన్నీ వాసు పవన్ కళ్యాణ్ కి కూడా సన్నిహితంగా ఉంటారు. గత ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు బన్నీవాసుకే అప్పగించారు. ఆల్రెడీ గతంలోనే బన్నీ వాసుని పిలిచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే టికెట్ కూడా ఆఫర్ చేసారు. 2024 ఎన్నికల్లో బన్నీవాసు నిడదవోలు నుంచి పోటీ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి. దానిపై నిర్మాత స్పందించి.. నిజమే కానీ నేనే వద్దన్నాను. నేను ఇంకా ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలి. గీత ఆర్ట్స్ ని ఇంకా పైకి తీసుకెళ్లాలి. పవన్ కళ్యాణ్ గారి వెంట ఒక్కసారి దిగితే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. అందుకే వద్దన్నాను అని క్లారిటీ ఇచ్చారు.
Also Read : Aadi Pinishetty : సరైనోడు సినిమా చూసి మెగాస్టార్ కాల్ చేసారు.. ఎయిర్ పోర్ట్ లో ఉన్నాను.. మా నాన్న ఎమోషనల్..
ఆ మధ్యలో అల్లు – మెగా విబేధాలు వచ్చాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీ వాసు జనసేనకు దూరమయ్యాడు అని కూడా అన్నారు. కానీ తాజాగా బన్నీ వాసుకి పవన్ కళ్యాణ్ పిలిచి మరీ కీలక పని చెప్పినట్టు తెలుస్తుంది. మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్టు జనసేన అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన నేతలు అంతా ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారు. ఎన్నికల్లో గెలుపు తర్వాత నిర్వహిస్తున్న ఆవిర్భావ సభ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ జనసేన ఆవిర్భావ వేడుకల ఈవెంట్ బాధ్యతలను అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసుకి అప్పగించారట పవన్ కళ్యాణ్. ప్రచార కార్యక్రమంతో పాటు, స్టేజ్ ఏర్పాటు, నిర్వహణ ఇవన్నీ కూడా బన్నీవాస్ కు పవన్ కళ్యాణ్ అప్పగించారని, బన్నీ వాసు ఆల్రెడీ వర్క్ మొదలు పెట్టాడని టాలీవుడ్ సమాచారం. దీంతో బన్నీ వాసు జనసేనతో తన బంధం కొనసాగిస్తున్నాడని తెలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో బన్నీ వాసు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.