Shruti Haasan : హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న శృతి హాసన్.. ‘ది ఐ’ సినిమా ట్రైలర్ చూశారా? ఇదేదో కొత్తగా ఉందే..
శృతి హాసన్, మార్క్ రౌలీ జంటగా 'ది ఐ' అనే సినిమా హాలీవుడ్ లో తెరకెక్కింది.

Shruti Haasan Entry into Hollywood with The Eye Movie Trailer Released
Shruti Haasan : కమల్ హాసన్ కూతురిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా వరుస సినిమాలు చేసింది శృతి హాసన్. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో హీరోయిన్ గా అనేక సినిమాలతో మెప్పించింది. నటిగానే కాకుండా సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా తన టాలెంట్ చూపించింది. ఇప్పుడు శృతి హాసన్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.
శృతి హాసన్, మార్క్ రౌలీ జంటగా ‘ది ఐ’ అనే సినిమా హాలీవుడ్ లో తెరకెక్కింది. ఫింగర్ ప్రింట్ కంటెంట్ బ్యానర్ పై డ్యాఫెన్ స్కమన్ దర్శకత్వంలో ఈ ది ఐ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా రేపు ఫిబ్రవరి 27 న ముంబై వెంచ్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. త్వరలోనే థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.
Also Read : Aha OTT : ఆహా ఓటీటీ మరో సరికొత్త ప్రయోగం.. తమిళ్ లో.. ఇండియాలోనే మొదటిసారి ఇలా..
మరణం అనేది జీవితానికి ఎండ్ కాదు అనే కొటేషన్ తో ది ఐ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది. శృతి హాసన్ పార్ట్నర్ పాత్ర మరణిస్తే ఏం జరిగింది అన్నట్టు కథాంశం ఉండబోతుంది. సినిమాలో శృతి బోల్డ్ గా కూడా నటించినట్టు తెలుస్తుంది. మీరు కూడా ది ఐ ట్రైలర్ చూసేయండి..
https://www.youtube.com/watch?v=UVbQOIJ3Y0Y