Hari Hara Veera Mallu : ప‌వ‌న్ అభిమానుల‌కు న్యూ ఇయ‌ర్ గిఫ్ట్‌.. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుంచి ఫ‌స్ట్ సింగిల్ ‘మాట వినాలి’..

కొత్త ఏడాది సంద‌ర్భంగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుంచి సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు.

Pawan kalyan Hari Hara Veera Mallu First single MaataVinaali Update

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ పక్క రాజ‌కీయాలు మ‌రో ప‌క్క సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఆయ‌న న‌టిస్తున్న చిత్రాల్లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ఒక‌టి. కొత్త ఏడాది సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని మొద‌టి పాట విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. మాట వినాలి అంటూ ఈ పాట సాగ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ పాట‌ను స్వ‌యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాడారు. ఈ పాట‌ను జ‌న‌వ‌రి 6న ఉద‌యం 9 గంట‌ల 6 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఆస్కార్ విన్న‌ర్ ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సూర్య‌మూవీస్ బ్యాన‌ర్‌పై ఏఎం ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది ఈ చిత్రం. తొలి భాగం మార్చి 28న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Mega Family : ‘మెగా నామ సంవత్సరం’ 2024.. మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిందిగా..

మొద‌ట క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా కొంత రూపుదిద్దుకుంది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న త‌ప్పుకోవ‌డంతో మిగిలిన భాగానికి జ్యోతి కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఏపీలో ఎన్నిక‌ల కార‌ణాల వ‌ల్ల కొంత కాలం ఈ చిత్ర షూటింగ్‌లో ప‌వ‌న్ పాల్గొన‌లేదు.

Nagavamsi – Boney Kapoor : బోనీకపూర్ వర్సెస్ నాగవంశీ.. బాలీవుడ్ సినిమా ఇంకా అక్కడే ఉంది.. ఫుల్ కౌంటర్లు వేసిన నిర్మాత..

ఇటీవ‌లే ప‌వ‌న్ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు. మ‌రో ఎనిమిది రోజుల షూటింగ్ మాత్ర‌మే మిగిలి ఉంద‌ని ఇటీవ‌లే ప‌వ‌న్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.