Mega Family : ‘మెగా నామ సంవత్సరం’ 2024.. మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిందిగా..
ఈ సంవత్సరం సినిమా పరిశ్రమలో చాలా మందికి కలిసి వచ్చినా ఎక్కువగా కలిసొచ్చింది మాత్రం మెగా ఫ్యామిలీకే అని చెప్పొచ్చు.

2024 is best Year for Mega Family in All Aspects Fans Called Mega Nama Samvathsaram
Mega Family 2024 : నేటితో 2024కు టాటా చెప్పేసి 2025కు స్వాగతం చెప్తున్నారు. ఈ సంవత్సరం సినిమా పరిశ్రమలో చాలా మందికి కలిసి వచ్చినా ఎక్కువగా కలిసొచ్చింది మాత్రం మెగా ఫ్యామిలీకే అని చెప్పొచ్చు. 2024లో మెగా ఫ్యామిలిలో పలువురికి మంచి గుర్తింపు రావడం, లాభాలు రావడం.. ఆల్మోస్ట్ అంతా మంచే జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి అయితే 2024 మరింత ప్లస్ అయింది. భారత ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. మెగా ఫ్యాన్స్ కు, ఫ్యామిలీకి ఆనందకర విషయం అయితే చిరంజీవికి అవార్డు అందుకోవడం మర్చిపోలేని విషయం. అలాగే ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్స్ లో ఒకరు అంటే చిరంజీవి పేరే వస్తుంది. ఇక టాలీవుడ్ డ్యాన్స్ కు ఆయనే బాస్. అలాంటిది అయన ఇన్నేళ్ళుగా ఆయన సినిమాల్లో వేసిన ఆల్మోస్ట్ 24 వేల స్టెప్పులకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది.
అంతే కాక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ లో చిరంజీవికి ఈ సంవత్సరం అవుట్ స్టాండింగ్ అచివ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డు అందించారు. అంతేకాక ఎంతో ప్రత్యేకమైన ఏఎన్నార్ నేషనల్ అవార్డుని ఈ సంవత్సరం అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవికి అందించారు. ఈ వేడుక ఘనంగా జరిగింది. ఇలా మెగాస్టార్ కి ఈ సంవత్సరం అంతా అవార్డులతో రివార్డులతో సాగింది.
Also Read : Anurag Kashyap : బాలీవుడ్ మారట్లేదు.. నేను సౌత్ కి వెళ్ళిపోతాను స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్..
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అయితే 2024 ఎన్నడూ లేనంతగా కలిసొచ్చింది. పార్టీ పెట్టి ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న పవన్ జనసేనకు ఈ సంవత్సరం ఊపిరి పోసింది. గత ఎన్నికల్లో పవన్ ఓడిపోయి జనసేన అసలు ప్రభావం చూపకపోయినా నిలబడి పోరాడి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ తో సరికొత్త రికార్డ్ సెట్ చేసారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడం ఒక ఎత్తైతే డిప్యూటీ సీఎం అవ్వడం మరో ఎత్తు. ఇక ప్రమాణ స్వీకారం రోజు పీఎం మోడీ చిరంజీవిని, పవన్ ని పట్టుకొని ప్రశంసించిన తీరు తెలుగు ప్రజలు, మెగా ఫ్యాన్స్ ఎప్పటికి మర్చిపోలేరు.
పవన్ గెలుపుని మెగా ఫ్యామిలీ పండగలా చేసుకున్న తీరు, కుటుంబం అంతా కదిలొచ్చి పవన్ కి స్వాగతం పలికిన తీరు, పవన్ పెద్దవాళ్ల కాళ్లకు నమస్కరించిన తీరు ఈ వీడియోలు వైరల్ అయి ఫ్యాన్స్ ని సంతోషాల్లో ముంచాయి. ఇక గెలిచిన తర్వాత పవన్ తాను చేసే మంచి పనులతో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్నారు. నరేంద్రమోడీ పవన్ కాదు తుఫాను అని నేషనల్ మీడియా ముందు చెప్పడం, మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసి అక్కడి అభ్యర్థులను గెలిపించడంతో పవన్ నేషనల్ లీడర్ అయిపోయాడు.
ఇక నాగబాబు జనసేన విజయంలో కీలక భాగం అయ్యారు. సంవత్సరం చివర్లో నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తాను అని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్, జనసైనికులు మరింత సంతోషం వ్యక్తపరిచారు. తాను పోటీ చేయాలనుకున్న సీటు కూడా వదిలేసి కష్టపడిన నాగబాబుకు మంచి ఫలితం దక్కింది అని అభిప్రాయపడుతున్నారు.
Also See : Balakrishna – Ram Charan : అన్‌స్టాపబుల్ షూట్ లో బాలయ్యతో చరణ్ – శర్వానంద్ సందడి.. ఫోటోలు చూశారా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు చెన్నైలోని వేల్స్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించడం విశేషం. ఫ్యాన్స్ కి గేమ్ చెంజర్ ప్రమోషన్స్ తో కిక్ ఇచ్చి కొత్త లుక్స్ తో RC16 సినిమాకు ప్రిపేర్ అవుతూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసారు ఈ సంవత్సరం చరణ్.
మెగా డాటర్ నిహారిక నటిగా, నిర్మాతగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాని కొత్త నటీనటులతో నిర్మించి పెద్ద హిట్ సాధించింది. ఈ సినిమా ఆల్మోస్ట్ 30 కోట్లు కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ నెలరోజుల పాటు థియేటర్లో ఆడింది. దీంతో నిహారికకు పేరు, డబ్బులు బాగానే వచ్చి మరింత వైరల్ అయింది.
ఇక అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నుంచి బయటపదామని అనుకుంటూ అల్లు బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నా, విబేధాలు వచ్చాయని అందరూ అంటున్నా కొంతమంది మాత్రం బన్నీని కూడా మెగా కాంపౌండ్ అని ఇంకా ఫీల్ అవుతున్నారు. బన్నీ పుష్ప 2 సినిమాతో నేషనల్ వైడ్ స్టార్ డమ్ మరింత పెంచుకొని ఏకంగా 1700 కోట్ల కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సెట్ చేసాడు. కాకపోతే సంధ్య థియేటర్ ఇష్యూతో జైలుకెళ్లి వచ్చి చివర్లో ఈ వివాదంలో చిక్కుకున్నాడు.
మెగా కోడలు ఉపాసన కూడా ఈ సంవత్సరం పలు మంచి కార్యక్రమాల్లో పాల్గొని పెద్దల మన్ననలు కూడా పొందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సభలో మాట్లాడింది. అయోధ్యలో అపోలో హాస్పిటల్ కట్టి ఉచిత ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించి అందరి చేత ప్రశంసలు పొందింది.
సాయి ధరమ్ తేజ్ కూడా తన సత్య షార్ట్ ఫిలిం తో ఫిలిం ఫేర్ అవార్డు సాధించారు ఈ సంవత్సరం. యాక్సిడెంట్ తర్వాత హెల్త్ పరంగా మరింత ఫిట్నెస్ సాధించి తన నెక్స్ట్ రాబోయే పాన్ ఇండియా సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి వైరల్ అయ్యాడు. ఇలా ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీ అందరికి 2024 సంవత్సరం బాగా కలిసి రావడంతో ఫ్యాన్స్ 2024 మెగా నామ సంవత్సరం అని అంటున్నారు.
2025 లో కూడా అందరు మెగా హీరోలకు సినిమాలు ఉన్నాయి. చరణ్ గేమ్ చెంజర్, చిరంజీవి విశ్వంభర, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, OG సినిమాలు, సాయి ధరమ్ తేజ్ సంబరాల యేటి గట్టు.. ఇలా ఆల్మోస్ట్ అందరు హీరోలు తమ సినిమాలతో 2025 లో రాబోతున్నారు. 2024 మెగా నామ సంవత్సరం అయింది. 2025 లో కూడా ఇది కంటిన్యూ చేస్తారేమో చూడాలి.