Hari Hara VeeraMallu : నేడే పవన్ ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడ? ఎన్నింటికి? గెస్టులు ఎవరు? ఫుల్ డీటెయిల్స్..

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్..

Hari Hara VeeraMallu Pre Release Event

Hari Hara VeeraMallu Pre Release Event : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కాబోతుంది. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్, గ్లింప్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా కంటే ముందు ఫ్యాన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జులై 21న హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో సాయంత్రం 6 గంటల నుండి జరగనుంది. కేవలం పాస్ లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంది. ఫ్యాన్స్ భద్రత దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ మంది మధ్యలోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మూవీ యూనిట్ కూడా పాస్ లు లేని వాళ్ళు ఈవెంట్ వేదిక వద్దకు రావొద్దని, అర్ధం చేసుకోవాలని, ఇంట్లోనే కూర్చొని చూడాలని చెప్తూ ఓ నోట్ కూడా రిలీజ్ చేసారు.

Also Read : Nihar Kapoor : ‘బాహుబలి’లో రానా పాత్ర నేను చేయాలి.. మూడు వారాల ట్రైనింగ్ అయ్యాక.. ఇతనెవరో తెలుసా?

ఇక హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కచ్చితంగా వస్తున్నారు. ఈ ఈవెంట్ కి గెస్టులుగా రెండు తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు కందుల దుర్గేష్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో పాటు కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖన్ద్రే రానున్నారు. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ తో పాటు మూవీ యూనిట్ అంతా హాజరుకానున్నారు.