HariHara VeeraMallu
HariHara VeeraMallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏడేళ్ల తర్వాత ఒరిజినల్ కథతో హరిహర వీరమల్లు అంటూ వస్తున్నాడు. రెండేళ్ల తర్వాత థియేటర్లో కనిపించబోతున్నాడు పవన్. ఓ పక్క పొలిటికల్ గా గత సంవత్సర కాలం నుంచి ఫుల్ హై లో ఉన్నారు. ఇలాంటి టైంలో వస్తున్న సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుంది. ఐదేళ్లు సాగినా, సినిమా హైప్ ట్రైలర్ రిలీజ్ అయ్యేదాకా సింపుల్ గా ఉన్నా పవర్ స్టార్ ఎంటర్ అవ్వగానే ఆయన క్రేజ్ అంతా సినిమాకు వచ్చేసింది.
అసలు ఈ సినిమాని ఎవరు చూస్తారు అని విమర్శలు చేసిన నోళ్లు ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ చూసి మూసుకుపోయాయి. ప్రీమియర్స్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్మిషన్స్ ఇవ్వడంతో నేడు రాత్రి 9.30 గంటల నుంచే షోలు ఉన్నాయి. దీంతో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని థియటర్స్ ఫుల్ అయ్యాయి. తర్వాత మూడు రోజులు కూడా కొన్ని థియేటర్స్ లో టికెట్స్ అయిపోయాయి.
Also Read : Kohinoor : కోహినూర్ డైమండ్ మళ్ళీ మన దేశానికి తిరిగి రావాలి.. పవన్ వ్యాఖ్యలు వైరల్..
ప్రీమియర్స్, అడ్వాన్స్ సేల్స్ తోనే ఇప్పటివరకు ఆల్మోస్ట్ 30 కోట్ల గ్రాస్ వచ్చిందని బాక్సాఫీస్ సమాచారం. ఎవరూ పట్టించుకోరు అని విమర్శలు చేసిన సినిమాకు పవన్ స్టార్ డమ్ తో కోట్లలో ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇక బుక్ మై షోలో గంటకు 15 వేల టికెట్స్ తో అడ్వాన్స్ బుకింగ్స్ దూసుకెళ్తున్నాయి. ఇవన్నీ చూసి ఇది కదా పవర్ స్టార్ రేంజ్ అంటే, ఇది కదా పవన్ కళ్యాణ్ మేనియా అంటే అని ఆశ్చర్యపోతున్నారు.
స్టార్ దర్శక నిర్మాతలు సైతం పవన్ కనిపిస్తే చాలు, పవన్ ఫ్లాప్ సినిమా అయినా కలెక్షన్స్ కురుస్తాయి అని కామెంట్స్ ఊరికే చేసేయలేదు. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ మరోసారి కళ్ళెదురుగా కనిపిస్తుంది. ఈ లెక్కన హరిహర వీరమల్లు సినిమా మంచి లాభాలు రాబట్టడం ఖాయం.
Also Read : Pawan Kalyan : నేను సపోర్ట్ చేసిన వాళ్ళే నా సినిమాలకు ఫైనాన్స్ ఇవ్వలేదు.. నాకు కథలు చెప్పడానికి రాలేదు..