Kohinoor : కోహినూర్ డైమండ్ మళ్ళీ మన దేశానికి తిరిగి రావాలి.. పవన్ వ్యాఖ్యలు వైరల్..
తాజాగా హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ నేడు మీడియాతో మాట్లాడుతూ..

Kohinoor Diamond
Kohinoor : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు సినిమా కోహినూర్ డైమండ్ గురించి, హిందువుల మీద మొగల్ రాజు ఔరంగజేబు చేసిన దాడి గురించి, అలాంటివాటికి హరిహర వీరమల్లు ఎలా ఎదుర్కున్నాడు అని ఉండబోతుందని పవన్, దర్శకుడు ప్రమోషన్స్ లో చెప్పారు.
కోహినూర్ డైమండ్ కథ అనగానే సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. కృష్ణా నది తీరాన దొరికిన కోహినూర్ నిజాం నవాబుల దగ్గరకు వెళ్లి అక్కడ నుంచి మొగల్స్ దగ్గరకు వెళ్లి తర్వాత బ్రిటిష్ వాళ్ళ వద్దకు వెళ్లి ఇప్పుడు లండన్ లో ఉంది. గతంలో పలుమార్లు కోహినూర్ డైమండ్ ఇండియాకు తిరిగి ఇచ్చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. పలువురు డిమాండ్ చేసారు.
Also Read : Pawan Kalyan : నేను సపోర్ట్ చేసిన వాళ్ళే నా సినిమాలకు ఫైనాన్స్ ఇవ్వలేదు.. నాకు కథలు చెప్పడానికి రాలేదు..
తాజాగా హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ నేడు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా కోహినూర్ గురించే. మన దగ్గర కృష్ణా నది తీర ప్రాంతంలో దొరికిన ఒక అరుదైన వజ్రం. ఇప్పుడు లండన్లో ఉంది. కోహినూర్ మన దేశానికి తిరిగి రావాలి. దానిపై చర్చ జరగాలి. ఆ చర్చకు ఈ సినిమా ఒక కారణం అవుతుంది. సినిమా చూసాక కోహినూర్ డైమండ్ గురించి చర్చ జరుగుతుంది అని అన్నారు.
మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత కోహినూర్ డైమండ్ గురించి ఏ రేంజ్ లో చర్చ జరుగుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం వద్దకు కోహినూర్ ని తిరిగి రప్పించాలనే ప్రతిపాదన ఏమైనా చేస్తారేమో చూడాలి.