Pawan Kalyan : యాక్టింగ్ కే కాదు, ఫైట్ కంపోజింగ్ కి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండానే.. పవన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
జానీ తో పాటు పలు సినిమాలకు నిర్మాతలు నష్టపోతే పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan
Pawan Kalyan : నిర్మాతలు కష్టాల్లో ఉన్నప్పుడు, సినిమా ఫెయిల్ అయినప్పుడు తమ రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చే హీరోలు చాలా తక్కువమంది ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. గతంలో కూడా జానీ తో పాటు పలు సినిమాలకు నిర్మాతలు నష్టపోతే పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకు ఏకంగా రెమ్యునరేషన్ తీసుకోకుండానే అయిదేళ్ల నుంచి ఎంత లేట్ అయినా పని చేసారు. మొదట ఈ సినిమాకు 12 కోట్ల అడ్వాన్స్ తీసుకోగా కొన్ని నెలల క్రితం నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి ఆ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసాడు. దీంతో అసలు ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదు.
అలాగే ఈ సినిమాలో చివరి 18 నిమిషాల ఫైట్ పవన్ తన మార్షల్ ఆర్ట్స్ వాడి తనే కంపోజ్ చేసాడు. దానికి కూడా పవన్ రెమ్యూనరేషన్ తీసుకోలేదు. గత రెండు రోజులుగా పవన్ రంగంలోకి దిగి హరిహర వీరమల్లు ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఉదయం పవన్ కళ్యాణ్ నేషనల్ మీడియాతో మాట్లాడారు.
ఈ క్రమంలో రెమ్యునరేషన్ గురించి ప్రశ్న ఎదురవ్వగా పవన్ సమాధానమిస్తూ.. రెమ్యునరేషన్ తీసుకోలేదు. సినిమా రిలీజ్ అవ్వడానికి నా సపోర్ట్ మొత్తం నేను చేశాను. ఈ సినిమా, ఇందులో ధర్మం, చరిత్ర కథ అందరికి చేరాలి. రిలీజ్ అయ్యాక అన్ని బాగుంటే అప్పుడు తీసుకుంటాను రెమ్యునరేషన్ అని అన్నారు. దీంతో సినిమా గురించి, నిర్మాత గురించి ఆలోచించి పవన్ రెమ్యునరేషన్ తీసుకోకపోవడంతో మరోసారి ఆయన్ని అభినందిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం పవన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.
Also Read : Nara Lokesh – Pawan Kalyan : మా పవన్ అన్న సినిమా.. ఆయన స్వాగ్.. నారా లోకేష్ స్పెషల్ ట్వీట్..