Nara Lokesh – Pawan Kalyan : మా పవన్ అన్న సినిమా.. ఆయన స్వాగ్.. నారా లోకేష్ స్పెషల్ ట్వీట్..
తాజాగా హరిహర వీరమల్లు సినిమాపై నారా లోకేష్ స్పెషల్ ట్వీట్ వేశారు.

Nara Lokesh - Pawan Kalyan
Nara Lokesh – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రేపు జులై 24న ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నేడు రాత్రికే పలు స్పెషల్ షోలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ అవ్వాలని ఫ్యాన్స్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కోరుకుంటున్నారు.
తాజాగా హరిహర వీరమల్లు సినిమాపై నారా లోకేష్ స్పెషల్ ట్వీట్ వేశారు.
Also Read : Pawan Kalyan : చాన్నాళ్లకు కలర్ ఫుల్ గా కనిపించిన పవన్ కళ్యాణ్.. ఫొటోలు..
నారా లోకేష్ తన ట్వీట్ లో.. మా పవన్ అన్న సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ‘హరిహర వీరమల్లు’ అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.
మా పవన్ అన్న సినిమా #HariHaraVeeraMallu విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో… pic.twitter.com/NP9rw3eZkR
— Lokesh Nara (@naralokesh) July 23, 2025
Also Read : OG : పవన్ ‘ఓజీ’ ఫస్ట్ సాంగ్ వచ్చేది అప్పుడేనా?