HariHara VeeraMallu : నేడే వైజాగ్ లో హరిహర వీరమల్లు మరో ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్..
పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి వరుస ప్రమోషన్స్ చేస్తుండటంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.

HariHara VeeraMallu
HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రేపు జులై 24న ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెరగ్గా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి వరుస ప్రమోషన్స్ చేస్తుండటంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.
ఇప్పటికే హైదరాబాద్ లో ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మంగళగిరిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియాతో మాట్లాడారు పవన్. ఇప్పుడు మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
Also Read : Nara Lokesh – Pawan Kalyan : మా పవన్ అన్న సినిమా.. ఆయన స్వాగ్.. నారా లోకేష్ స్పెషల్ ట్వీట్..
నేడు వైజాగ్ లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న AU కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 4 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. డైరెక్టర్, నిర్మాత, నిధి అగర్వాల్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఈవెంట్ కి హాజరవనున్నారు. భారీగా ఫ్యాన్స్ కూడా హాజరు కాబోతున్నారు. ఇలా సినిమాకు వరుస ప్రమోషన్స్ చేస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
A storm of swords and slogans will erupt in VIZAG today ⚔️🔥
Pre Release Celebrations of #HariHaraVeeraMallu kicks off at Andhra University from 4PM onwards 🦅🦅#HHVM
Powerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi @amjothikrishna @mmkeeravaani… pic.twitter.com/r8QIQqhvNh— Mega Surya Production (@MegaSuryaProd) July 23, 2025
Also Read : Pawan Kalyan : చాన్నాళ్లకు కలర్ ఫుల్ గా కనిపించిన పవన్ కళ్యాణ్.. ఫొటోలు..