HariHara VeeraMallu : హమ్మయ్య ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అయిపోయింది.. లాస్ట్ డే ఫోటో విడుదల.. రిలీజ్ ఎప్పుడు?

పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు ఎప్పుడో అయిదేళ్ల క్రితం మొదలయి ఇన్నాళ్లు సాగుతూ వచ్చింది.

Pawan Kalyan HariHara VeeraMallu Movie Shooting Completed Finally

HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో తన చేతిలో ఉన్న సినిమాలకు డేట్స్ ఇవ్వడం కుదరట్లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు సినిమాలను పూర్తి చేస్తాను అని చెప్పాడు. ఇటీవల నిర్మాతలతో మీటింగ్ పెట్టి మూడు సినిమాలను ఆగస్టు కల్లా పూర్తి చేస్తానని తెలిపాడు.

పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు ఎప్పుడో అయిదేళ్ల క్రితం మొదలయి ఇన్నాళ్లు సాగుతూ వచ్చింది. ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి పలు మార్లు వాయిదా వేశారు. ఎట్టకేలకు ఆ సినిమా షూటింగ్ పూర్తయింది. చివరి రెండు రోజులు షూటింగ్ ని పవన్ కళ్యాణ్ నేడు పూర్తి చేసారు. మూవీ యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.

Also Read : Samantha : అతనే నా బిజినెస్ పార్టనర్.. బిజినెస్, సినిమా అన్నిట్లో.. సమంత కామెంట్స్ వైరల్.. ఎవరు ఇతను?

హరిహర వీరమల్లు సెట్ నుంచి పవన్ తో సంకేతిక నిపుణులు దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హమ్మయ్య అయిదేళ్లుగా సాగుతున్న సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తయిందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసి ఈ సినిమాని మే 30 లేదా జూన్ రెండో వారంలో రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది.

త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తామని రెండు రోజుల క్రితం మూవీ యూనిట్ ప్రకటించింది. ట్రైలర్ తో పాటే హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాని జ్యోతి కృష్ణ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఏం రత్నం నిర్మాణంలో తెరకెక్కిస్తుండగా నిధి అగర్వాల్, బాబీ డియోల్, నోరా ఫతేహి.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక పవన్ త్వరలోనే OG సినిమా షూట్ లో పాల్గొననున్నాడు అని సమాచారం.

Also Read : Samantha : ఆ విషయంలో నేనేం తప్పు చేస్తానో నాకు తెలుస్తుంది.. నాకు ఎవరూ చెప్పక్కర్లేదు..