Pawan Kalyan HariHara VeeraMallu Movie Super Update on Dasara with New Poster
HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత ఇటీవలే మళ్ళీ పవన్ డేట్స్ ఇవ్వడంతో షూటింగ్ మొదలుపెట్టారు. దీంతో రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తున్నారు నిర్మాణ సంస్థ. మెగా సూర్య ప్రొడక్షన్స్ లో జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా వచ్చే సంవత్సరం మార్చ్ 28న రిలీజ్ చేస్తామని ఇటీవల ప్రకటించారు.
తాజాగా దసరా పండుగ సందర్భంగా నేడు హరిహర వీరమల్లు సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో పవన్ పాట పడతాడని వార్తలు వస్తున్నాయి. అది నిజమే అంటూ అధికారికంగా.. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఓ పాట పాడారు తెలుగులో. ఆ పాట త్వరలోనే రాబోతుందని ప్రకటించి కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు నిర్మాణ సంస్థ.
ఈ పోస్టర్ లో పవన్ విల్లు ఎక్కుపెట్టి నిప్పు అంటించిన బాణాలు వదులుతున్నట్టు ఉంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఖుషి, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి.. ఇలా పలు సినిమాల్లో పాడి ఫ్యాన్స్ ని మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడుమరోసారి పవన్ హరిహర వీరమల్లు సినిమాలో పాడారు అని ప్రకటించడంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Team #HariHaraVeeraMallu wishes you all a very #HappyDussehra 🔱✨
On this auspicious occasion, We would like to announce with pride, "Battle of Dharma". The first single sung by none other than our Power Star @PawanKalyan garu in Telugu will be unveiled soon! 🏹🔥 pic.twitter.com/kDr58UXYvD
— Mega Surya Production (@MegaSuryaProd) October 12, 2024
ప్రస్తుతం ఈ సినిమా విజయవాడలో షూటింగ్ జరుగుతుంది. రెండు పార్టులుగా ఈ సినిమా రాబోతుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో AM రత్నం నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Team #HariHaraVeeraMallu wishes you all a very #HappyDussehra 🔱✨
On this auspicious occasion, We would like to announce with pride, "Battle of Dharma", the first single will be unveiled soon! 🏹🔥
Power star 🌟@PawanKalyan @AMRathnamOfl @thedeol pic.twitter.com/CCfjw0FnRM
— Mega Surya Production (@MegaSuryaProd) October 12, 2024