Pawan Kalyan: పవన్ సినిమాకు అదే టైటిల్ ఫిక్స్ అంటోన్న హరీష్ శంకర్..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా పీరియాడికల్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత పవన్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు ఓ ట్వీట్ చేశారు.

Pawan Kalyan: పవన్ సినిమాకు అదే టైటిల్ ఫిక్స్ అంటోన్న హరీష్ శంకర్..?

Pawan Kalyan Harish Shankar Movie To Have The Same Title

Updated On : December 10, 2022 / 9:35 PM IST

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా పీరియాడికల్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత పవన్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు ఓ ట్వీట్ చేశారు.

Pawan Kalyan: పవన్ సినిమాకు నో చెప్పిన మ్యూజిక్ సెన్సేషన్.. ఆ గాయం ఇంకా మానలేదా..?

ఇక ఆయన ఈ సినిమా గురించి అనౌన్స్ చేయగానే, ఇది తమిళ మూవీ ‘తేరి’కి రీమేక్ అని.. ఈ సినిమా వద్దు బాబోయ్ అంటూ సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ట్రెండ్ క్రియేట్ చేశారు. కానీ, ఈ సినిమాను హరీష్ శంకర్ తనదైన మార్క్‌లో రూపొందించబోతున్నాడని.. తేరి కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా పలు మార్పులు చేయబోతున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇక ఈ సినిమాలో పవన్ పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నాడట ఈ డైరెక్టర్.

Harish Shankar : పవన్ అభిమానులకు శుభవార్త చెప్పబోతున్న హరీష్ శంకర్..

అయితే ఈ సినిమాకు హరీష్ శంకర్ గతంలో అనౌన్స్ చేసిన ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే టైటిల్‌నే ఫిక్స్ చేయబోతున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే తేరి రీమేక్ సినిమాకు ఈ టైటిల్ ఎంతమేర యాప్ట్ అవుతుందో చూడాలి అంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను చిత్ర యూనిట్ త్వరలోనే చేయబోతున్నారు.