Ustaad Bhagat Singh : ధర్మసంస్థాపనార్థం కోసం.. ఉస్తాద్ భగత్ సింగ్ యాక్షన్ షురూ..

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ షురూ. యాక్షన్ షెడ్యూల్ తో మంగళవారం నుంచి..

Pawan Kalyan Harish Shankar Ustaad Bhagat Singh shooting starts

Ustaad Bhagat Singh : ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం.. శరవేగంగా మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. అయితే సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టుకోడానికి మాత్రం చాలా గ్యాప్ తీసుకుంది. ఈ గ్యాప్ వల్ల ఒక సమయంలో ఈ మూవీ ఆగిపోయింది అని కూడా వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ పై మేకర్స్ కూడా రెస్పాండ్ అవ్వకపోవడంతో అభిమానులు కూడా కొంత నిరాశ చెందారు.

Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు పై పవన్ కళ్యాణ్‌కి ఇంటరెస్ట్ లేదు.. ఏ ఎం రత్నం జవాబు..

అయితే ఇటీవల ఈ మూవీ షూటింగ్ పై అప్డేట్ ఇచ్చి.. ఆ రూమర్స్ అన్నిటికి చెక్ పెట్టేశారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ని సెప్టెంబర్ మొదటి వారంలో మొదలు పెట్టబోతున్నట్లు తెలియజేశారు. తాజాగా రేపటి నుంచి మాసివ్ యాక్షన్ షెడ్యూల్ మొదలు పెట్టుకోబోతున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఒక పిక్ ని షేర్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన వెపన్స్ తో కలిసి హరీష్ శంకర్ ఆ పిక్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ వార్తతో పవన్ అభిమానులు ఖుషీ ఫీల్ అవుతున్నారు.

OG Movie : OG మూవీ సెట్స్ నుంచి ఫోటో లీక్.. నెట్టింట వైరల్..!

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela), సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తమిళ్ మూవీ ‘తేరి’కి ఇది రీమేక్ గా వస్తుంది. అయితే కథలో చాలా చేంజ్స్ చేసి కొత్త స్క్రీన్ ప్లేతో హరీష్ శంకర్ మూవీని సిద్ధం చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి హరీష్ శంకర్ ఆ అంచనాలను అందుకుంటాడా..? లేదా..? చూడాలి.