Pawan Kalyan : నేడు వైజాగ్ లో సేనతో సేనాని అని జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వేలాది మంది క్రియాశీలక జనసైనిక సమూహం తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు కూడా స్టేజిపై మాట్లాడటం గమనార్హం. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తన పార్టీ గురించి, చేయబోయే పనుల గురించి, సాధించిన విజయాల గురించి మాట్లాడారు.(Pawan Kalyan)
Also See : Balakrishna : వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్న బాలయ్య.. భారీ సన్మానం.. ఫొటోలు..
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఖుషి సినిమా అయ్యాక పెద్ద విజయం వచ్చాక ఇంకో విజయం వస్తే దేశం మొత్తం తెలుస్తాం, ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో తెలుస్తాం ఏమో. కానీ ఆ రోజు ఆనందం అనిపించలేదు. సినిమాల్లో చేస్తే, అవన్నీ సాధిస్తే నాకు ఆనందం ఉంటుందా, అవన్నీ అయ్యాక అంటే నాకు సమాధానం దొరకలేదు. అందుకే ఆ రోజు నుంచి నుంచి సినిమాల మీద ఎంత ప్రూవ్ చేసుకున్నానో తెలియలేదు కానీ ఇది నిజ జీవితంలో చేయగలిగితే, జనాల కోసం నిలబడితే ఎలా ఉంటుంది అని ఆలోచించా. చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను అప్పుడే. ఇక్కడ సమస్యలు చూసి వాటిని తీరుస్తుంటే ఈ రోజు నేను అప్పుడు తీసుకున్న నిర్ణయం సరైంది అనిపిస్తుంది అని తెలిపారు.
Also See : Priyanka Chopra : ఆఫ్రికాలో మహేష్ – రాజమౌళి సినిమా షూటింగ్.. ఫొటోలు షేర్ చేసిన ప్రియాంక చోప్రా..