Pawan Kalyan
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైంది. ఏపీ ఎన్నికలు .. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో మిగతా పార్ట్ వాయిదా పడింది. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో పవన్ మరోసారి పాట పాడబోతున్నట్లు తెలుస్తోంది.
Rahul Ravindran : గుంటూరు కారం సీక్వెల్? ఆ రెండు పాత్రలతో.. రాహుల్ రవీంద్రన్ ఏమన్నాడంటే?
సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ చేస్తున్న మూవీ ‘ఓజీ’ 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో పవన్ పాట పాడబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Sitara Ghattamaneni : శ్రీలీలతో సితార పాప.. గుంటూరు కారం సక్సెస్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్..
పవన్ కల్యాణ్ తన సినిమాల్లో పాట పాడటం కొత్తేం కాదు. గతంలో ఆయన ఎమ్ పిల్ల మాటాడవా (తమ్ముడు), బైబైయే బంగారు రమణమ్మ (ఖుషి), నువ్వు సారా తాగుట (జానీ), పాపారాయుడు (పంజా), కాటమ రాయుడా (అత్తారింటికిదారేది), కొడకా కోటేశ్వర్ రావు (అజ్ఞాతవాసి) తో పాటు పలు పాటలు పాడి ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపారు. తాజాగా ఓజీ మూవీలో కూడా పవన్ పాట పాడబోతున్నారని తెలుస్తోంది. నిజంగా అదే జరిగితే పవన్ ఫ్యాన్స్ కి పండగే మరి. ప్రస్తుతం పొలిటికల్ గా గ్యాప్ తీసుకుంటున్న పవన్ కల్యాణ్ త్వరలోనే మిగిలిన షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.