Rahul Ravindran : గుంటూరు కారం సీక్వెల్? ఆ రెండు పాత్రలతో.. రాహుల్ రవీంద్రన్‌ ఏమన్నాడంటే?

గుంటూరు కారం సినిమాకి సీక్వెల్ లేదా ఓ రెండు పాత్రలతో సపరేట్ సినిమా ఉండొచ్చు అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.

Rahul Ravindran : గుంటూరు కారం సీక్వెల్? ఆ రెండు పాత్రలతో.. రాహుల్ రవీంద్రన్‌ ఏమన్నాడంటే?

Rahul Ravindran Comments on Mahesh Babu Guntur Kaaram Sequel Movie Interesting Tweet goes Viral

Updated On : January 17, 2024 / 12:09 PM IST

Rahul Ravindran : మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా ఈ సంక్రాంతికి రిలీజయి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గుంటూరు కారం సినిమా 175 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి 200 కోట్లకు దూసుకెళ్తుంది. ఇక చిత్రయూనిట్ ఆల్రెడీ మహేష్ ఇంట్లో గుంటూరు కారం సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు. కామెడీ, లవ్, అమ్మ సెంటిమెంట్, మహేష్ మాస్ మేనియాతో గుంటూరు కారం ప్రేక్షకులని మెప్పిస్తుంది.

అయితే గుంటూరు కారం సినిమాకి సీక్వెల్ లేదా ఓ రెండు పాత్రలతో సపరేట్ సినిమా ఉండొచ్చు అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. గుంటూరు కారం సినిమాలో నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా ఉన్నాడు. రమ్యకృష్ణ రెండో కొడుగ్గా రాహుల్ నటించాడు. అయితే క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్టులతో అసలు రాహుల్ ఎవరి కొడుకు అనే ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకి సినిమాలో సమాధానం లేదు. దీంతో సినిమా చూసిన పలువురు నెటిజన్లు.. ఇంతకీ సినిమాలో నువ్వు ఎవరి కొడుకువి అని రాహుల్ రవీంద్రన్ ని ప్రశ్నిస్తున్నారు.

దీనికి రాహుల్ సమాధానమిస్తూ.. చాలా మంది నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు. నాకు కూడా తెలీదు. కానీ ఆ షూట్ రోజున నేను కూడా ఇదే ఆలోచించాను. అక్కడ మరో కథకి అవకాశం ఉంది. రావు రమేష్ గారి పాత్రకి – నా పాత్రకి మధ్య ఏం జరిగింది? ఆ సంఘటన ముందు ఏం జరిగింది? తర్వాత ఏం జరిగింది అనే కథాంశంతో ఓ ప్రత్యేకమైన తండ్రి కొడుకు బంధంతో సినిమాని తీయొచ్చు. అక్కడ ఒక అద్భుతమైన డ్రామాని పండించొచ్చు. హాలీవుడ్ లో రాచెల్ గెట్టింగ్ మ్యారీడ్, సైడ్ వేస్, ఫైండింగ్ నెమో.. లాంటి సినిమాల్లాగా రావు రమేష్ నా తల్లితండ్రుల్ని వెతికే కథాంశంతో సినిమాని రాసుకోవచ్చు. అంతే కాకుండా ఇంకా చాలా పాజిబిలిటీస్ కూడా ఉన్నాయి అని పోస్ట్ చేశాడు.

Also Read : Sitara Ghattamaneni : శ్రీలీలతో సితార పాప.. గుంటూరు కారం సక్సెస్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్..

దీంతో రాహుల్ చెప్పినట్టు రాహుల్ – రావు రమేష్ పాత్రలతో సపరేట్ సినిమా వస్తుందా? అది గుంటూరు కారం సినిమాకి సంబంధం ఉంటుందా? గుంటూరు కారంకి సీక్వెల్ అవుతుందా అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. మరి రాహుల్ ఏం చేస్తాడో చూడాలి.