Pawan Kalyan: ఇలాంటి టీమ్ ఉండుంటే.. నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో.. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్..

నేను సినిమా ప్రేమికుడిని. సినిమా చేసేటప్పుడు నాకు సినిమా తప్ప మరో ఆలోచన ఉండదు.

Pawan Kalyan: ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుజీత్ డైరెక్షన్ టీమ్ పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. సుజీత్ డైరెక్షన్ టీమ్ వెరీ బ్రిలియంట్ అంటూ కితాబిచ్చారు. అంతేకాదు.. తాను డైరెక్షన్ చేసే సమయంలో ఇలాంటి టీమ్ కనుక ఉండి ఉంటే.. తాను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో అని పవన్ కల్యాణ్ అన్నారు.

”సినిమాలు వదిలేసి పాలిటిక్స్ కి వెళ్లినా.. మీరు నన్ను వదల్లేదని నాకు అనిపిస్తుంది. మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది. రాజకీయాల్లో ప్రజల కోసం కొట్లాడుతున్నాను అంటే మీరిచ్చిన బలమే. నేను సినిమా ప్రేమికుడిని. సినిమా చేసేటప్పుడు నాకు సినిమా తప్ప మరో ఆలోచన ఉండదు. రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు తప్ప మరో ఆలోచన ఉండదు. సుజీత్ డైరెక్షన్ టీమ్ వెరీ బ్రిలియంట్. నేను డైరెక్షన్ (జానీ) చేసే సమయంలో ఇలాంటి దర్శకత్వ టీమ్ ఉండి ఉంటే నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో. అలాంటి బ్యూటిఫుల్ టీమ్ ఉంది. తెలుగోడు అంటే ఉరుముతుంది ఆకాశం. బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్ అంటూ” తమన్ పైనా ప్రశంసల వర్షం కురిపించారు పవన్ కల్యాణ్.

పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్‌ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ఓజీ. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మాతలు. ప్రియాంక మోహన్‌ హీరోయిన్. ఇమ్రాన్‌ హష్మీ విలన్ గా నటించారు. ఈ నెల 25న ఓజీ విడుదల కానుంది.

డైరెక్టర్ సుజీత్ పై పవన్ ప్రశంసలు కురిపించారు. సుజీత్ డైరెక్షన్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. తక్కువ చెబుతాడు, సినిమా తీసేటప్పుడు మాత్రం మామూలుగా ఉండదన్నారు. సుజీత్‌ విజన్‌ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన మరో వ్యక్తి తమన్ అని పవన్ అన్నారు‌. ఈ సినిమా చేస్తున్నప్పుడు నేనొక డిప్యూటీ సీఎం అన్న సంగతే మర్చిపోయానన్నారు పవన్. ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా? అని పవన్ అన్నారు.