Pawan Kalyan – Anjanamma : పాలిటిక్స్ ఎందుకు, సినిమాలు చేసుకోవచ్చు కదా.. ఎందుకు ఈ బాధలు అనిపించింది.. పవన్ తల్లి వ్యాఖ్యలు..

పవన్ ఇలా పాలిటిక్స్ లోకి వెళ్తున్నప్పుడు, వెళ్ళాక చాలా కష్టపడినప్పుడు మీకేమనిపించింది అని యాంకర్ అడగ్గా అంజనమ్మ ఆసక్తికర సమాధానం తెలిపింది.

Pawan Kalyan Mother Anjanamma Interesting Comments on his Politics and his Donations

Pawan Kalyan – Anjanamma : పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మ తాజాగా జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ కోసం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి, అతని చిన్నతనం గురించి, రాజకీయాలు గురించి.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అయితే పవన్ ఇలా పాలిటిక్స్ లోకి వెళ్తున్నప్పుడు, వెళ్ళాక చాలా కష్టపడినప్పుడు మీకేమనిపించింది అని యాంకర్ అడగ్గా అంజనమ్మ ఆసక్తికర సమాధానం తెలిపింది.

Also Read : Pawan Kalyan – Anjanamma : చిన్నప్పుడు నా కోసం అయ్యప్ప మాల వేసుకున్నాడు.. పవన్ దీక్షలపై పవన్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు..

పవన్ కళ్యాణ్ రాజకీయాలపై తల్లి అంజనమ్మ మాట్లాడుతూ.. మొదట్లో పాలిటిక్స్ ఎందుకు అనుకున్నాను. సినిమాలు చేసుకోవచ్చు కదా అని చెప్పాను. కానీ అది చేస్తాను, ఇది చేస్తాను అన్నాడు. ఆ రోజు రోడ్డు మీద పడుకున్నప్పుడు ఎందుకు ఈ బాధలు అని అనిపించేది, పాపం అనిపించేది. కాని ఇన్ని కష్టాలు పడి ఇప్పుడు సాధించాడు అని తెలిపారు.

ఇక పవన్ చేసే సహాయాల గురించి మాట్లాడుతూ.. ముగ్గురు కొడుకులు సహాయాలు చేస్తారు. వాళ్ళ నాన్న గారి దగ్గర్నుంచి ఆ గుణం వచ్చింది. కాని కళ్యాణ్ బాబు ఇంకొంచెం ఎక్కువ సహాయాలు చేస్తాడు. ఇప్పుడు రాజకీయాల్లోనే కాదు గతంలో సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు కూడా చాలా మందికి సహాయం చేసాడు అని తెలిపారు. ప్రస్తుతం పవన్ తల్లి అంజనమ్మ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.