Pawan Kalyan – Anjanamma : చిన్నప్పుడు నా కోసం అయ్యప్ప మాల వేసుకున్నాడు.. పవన్ దీక్షలపై పవన్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు..

పవన్ కళ్యాణ్ ఇటీవల వరుసగా దీక్షలు చేస్తున్నారు అని యాంకర్ అడగ్గా దానికి సమాధానమిస్తూ పవన్ తల్లి అంజనమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Pawan Kalyan – Anjanamma : చిన్నప్పుడు నా కోసం అయ్యప్ప మాల వేసుకున్నాడు.. పవన్ దీక్షలపై పవన్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు..

Pawan Kalyan Mother Anjanamma Comments on his Deeksha

Updated On : October 3, 2024 / 8:08 AM IST

Pawan Kalyan – Anjanamma : తాజగా పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ లో ఈ ఇంటర్వ్యూని రిలీజ్ చేసారు. ఈ ఇంటర్వ్యూలో అంజనమ్మ పవన్ కళ్యాణ్ గురించి, అతని చిన్నతనం, అతని పట్టుదల, రాజకీయాలు.. ఇలా అనేక విషయాలు మాట్లాడారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఇటీవల వరుసగా దీక్షలు చేస్తున్నారు అని యాంకర్ అడగ్గా దానికి సమాధానమిస్తూ అంజనమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read : Pawan kalyan : అన్నప్రాశన రోజు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు పెట్టిన పేరు ఏంటో తెలుసా?

పవన్ దీక్షల గురించి అంజనమ్మ మాట్లాడుతూ.. కళ్యాణ్ బాబు చిన్నప్పట్నుంచి దీక్షలు తీసుకున్నాడు. చిన్నప్పుడు అయ్యప్ప మాల కూడా వేసుకున్నాడు. చిన్నప్పుడు నేనే శబరిమలై వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అని అడిగాను. దాంతో నా కోసం అయ్యప్ప మాల వేసుకున్నాడు. మేము వెళ్లి దర్శనం చేసుకొని వచ్చాం. అలా అని ఎక్కువ పూజలు చేయడాలు, దండాలు పెట్టడాలు చేసేవాడు కాదు. ఇప్పుడు పెద్దయ్యాక తనే ఎక్కువ పూజలు చేస్తున్నాడు. మంచిదే కదా అని అన్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల వారాహి దీక్ష, నవరాత్రి దీక్ష, ప్రాయశ్చిత్త దీక్ష.. ఇలా ఏదో ఒక దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.