Pawan kalyan : అన్నప్రాశన రోజు పవన్‌కళ్యాణ్‌కు పెట్టిన పేరు ఏంటో తెలుసా?
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బిజీగా ఉన్నారు.

Pawan kalyan mother Anjanamma special Interview
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బిజీగా ఉన్నారు. ఇక సినీ నటుడిగా ఆయన ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ తల్లిదండ్రులు అన్నప్రాశన రోజు ఏం పేరు పెట్టారో తెలుసా? శ్రీకళ్యాణ్ కుమార్ అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని పవన్ తల్లి అంజనమ్మ తెలిపింది.
అంజనమ్మని స్పెషల్ ఇంటర్య్వూ చేశారు. అమ్మ మనసు పేరుతో ఈ ఇంటర్వ్యూని జనసేన పార్టీ తన యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ చేసింది. ఇందులో యాంకర్ పవన్ కళ్యాణ్ అన్నప్రాశన రోజు ఏం పేరు పెట్టారని అడుగగా.. శ్రీ కళ్యాణ్‌కుమార్ అని పెట్టినట్లు అంజనమ్మ తెలిపారు.
Nagarjuna : కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున రియాక్షన్.. మా కుటుంబం పట్ల..
పవన్ డిప్యూటీ సీఎం కావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేవుడి దయ వల్ల ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. పవన్ తన కష్టాన్ని ఎవ్వరికి చెప్పడని అన్నారు. ఇంకా ఈ ఇంటర్వ్యూలో అంజనమ్మ పవన్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశారు.