Pawan Kalyan : ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో పవన్ కొత్త సినిమా.. అందుకే ఈ హెయిర్ స్టైల్.. ఫ్యాన్స్ కి పండగే..
నేడు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాని ప్రకటించారు. (Pawan Kalyan)
Pawan Kalyan
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ చేతిలో ఉన్న సినిమాలు మాత్రం చేస్తున్నారు. ఇటీవలే OG సినిమాతో పెద్ద హిట్ కొట్టగా ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ లాస్ట్ సినిమా అనుకున్నారు. కానీ OG 2 కూడా చేస్తానని ప్రకటించాడు. ఇప్పుడు గతంలో ఆగిపోయిన మరో సినిమాని కూడా చేస్తున్నట్టు ప్రకటించారు.(Pawan Kalyan)
నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ హీరోగా గతంలో ఓ సినిమాని ప్రకటించగా పవన్ బిజీతో ఆ సినిమాని ఇన్నాళ్లు పక్కన పెట్టేసారు. ఇప్పుడు అదే సినిమాని నేడు కొత్త నిర్మాణ సంస్థ మీదుగా ప్రకటించారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీ కలిసి పవన్ తో దిగిన ఫోటోని ఈ సందర్భంగా షేర్ చేసారు.
టాలీవుడ్ సమాచారం ప్రకారం ఇది ఆర్మీ బ్యాక్ డ్రాప్ కథ అని, ఇందులో పవన్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ ఓ కొత్త హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నారు. ఆర్మీ వాళ్ళ హెయిర్ స్టైల్ గా, చాలా చిన్న జుట్టు తో కనిపిస్తున్నారు.

ఈ హెయిర్ స్టైల్ ఎందుకు అని ఇన్ని రోజులు పవన్ ఫ్యాన్స్ అనుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా అయిపోయింది, OG 2 ఇప్పట్లో లేదు. దీంతో పవన్ కళ్యాణ్ కొత్త హియర్ స్టైల్ సురేందర్ రెడ్డి సినిమాకే అని నేటి ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి పవన్ కొత్త సినిమా ప్రకటించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
