Pawan Kalyan – Prabhas : OG సినిమాతో సాహోకి సంబంధం.. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్..?

పవన్ కళ్యాణ్ OG మూవీకి ప్రభాస్ సాహోకి కనెక్షన్. నెట్టింట వైరల్ అవుతున్న లీక్ అయిన పిక్స్.

Pawan Kalyan OG connects with Prabhas Saaho movie pics viral

Pawan Kalyan – Prabhas : డివివి దానయ్య నిర్మాణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న గ్యాంగ్ స్టార్ మూవీ OG. ఈ సినిమాకి సాహో (Saaho) ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్ చాలా కాలం తరువాత గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో సినిమా చేస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టే దర్శకుడు ఈ మూవీని చాలా పక్కాగా తెరకెక్కిస్తున్నాడు. ఆల్రెడీ మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇటీవలే నాలుగో షెడ్యూల్ ని కూడా మొదలు పెట్టుకుంది.

Project K : అమెరికా ఈవెంట్‌లో ప్రాజెక్ట్ K సందడి చూశారా..? నెట్టింట వీడియో వైరల్..

పవన్ కళ్యాణ్ లేకుండానే ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఒక ఫోటో లీక్ అయ్యింది. ఇక ఆ ఫోటో చూసిన అభిమానులు.. ప్రభాస్ సాహోతో ఈ మూవీకి కనెక్షన్ ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ పిక్ లో “వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్” అనే పేరు కనబడుతుంది. సాహోలో గ్యాంగ్ స్టార్స్ అంతా ఉండేది వాజీ సిటీలో అని డైరెక్టర్ సుజిత్ ఆ మూవీలో చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో ఆ పేరు కనిపించడంతో అభిమానులు.. సాహో అండ్ OG కనెక్షన్ ఉండబోతుందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Upasana : చెంచు జాతి సంస్కృతిలో భాగంగా నామకరణం.. ‘క్లీంకార’కి ఎటువంటి ట్యాగ్స్ ఇవ్వకండి.. ఉపాసన రిక్వెస్ట్..!

అయితే కొంతమంది నెటిజెన్స్ మాత్రం.. ‘సాహోకి ఉపయోగించిన సెట్ ప్రోపర్టీని ఇప్పుడు కూడా వాడుతున్నారు అనుకుంటా. అంతేగాని ఇదేం సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ కాదని’ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ అండ్ పవన్ అభిమానులు మాత్రం ఈ సినిమాటిక్ యూనివర్స్ పడితే.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ కనబడుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. మరి OG లో సాహో కనెక్షన్ ఉంటుందో లేదో చూడాలి. కాగా ఈ సినిమాలో ప్రియాంక మోహన్ నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రియారెడ్డితో పాటు బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.