Upasana : చెంచు జాతి సంస్కృతిలో భాగంగా నామకరణం.. ‘క్లీంకార’కి ఎటువంటి ట్యాగ్స్ ఇవ్వకండి.. ఉపాసన రిక్వెస్ట్..!

రామ్ చరణ్ కూతురు 'క్లీంకార'ని మెగా అభిమానులంతా ముద్దుగా మెగా ప్రిన్సెస్ అనే ట్యాగ్ తో పిలుచుకుంటున్నారు. అయితే ఉపాసన మాత్రం తనకి ఎటువంటి ట్యాగ్స్ పెట్టకండి అంటున్నారు.

Upasana : చెంచు జాతి సంస్కృతిలో భాగంగా నామకరణం.. ‘క్లీంకార’కి ఎటువంటి ట్యాగ్స్ ఇవ్వకండి.. ఉపాసన రిక్వెస్ట్..!

Upasana request to mega fans dont gave any tags to Ram Charan daughter

Updated On : July 20, 2023 / 7:15 PM IST

Upasana : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన.. ఇటీవల తమ మొదటి బేబీకి ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లయిన పదేళ్లకు వీరిద్దరూ తల్లిదండ్రులు అవ్వడం మెగా కుటుంబంతో పాటు మెగా అభిమానుల్లో కూడా ఎంతో ఆనందాన్ని తీసుకు వచ్చింది. ఇక ఈ మెగా వారసురాలికి లలితా సహస్రనామంలోని ‘క్లీంకార’ (Klin Kaara) అనే పేరుని పెట్టారు. అంతేకాదు క్లీంకార నామకరణ కార్యక్రమాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ఒడిస్సా అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచు జాతి సంస్కృతిలో భాగంగా చేయడం అందరి మన్ననలు అందుకున్నారు.

Ram Charan : ఉపాసనకి అండ్ కూతురికి వన్ మంత్ బర్త్ డే విషెస్ చెబుతూ చరణ్ ఎమోషనల్ వీడియో..

కాగా ఈ మెగా వారసురాలిని మెగా అభిమానులంతా ముద్దుగా మెగా ప్రిన్సెస్ అనే ట్యాగ్ తో పిలుచుకుంటున్నారు. అయితే దీని పై ఉపాసన స్పదించారు. ”క్లీంకార పేరుకి ముందు వెనుక ఎటువంటి ట్యాగ్స్ పెట్టకండి. అలాంటి ట్యాగ్స్ ని వారే కష్టపడి స్వయంగా సంపాదించుకోవాలి అనేది నా అభిప్రాయం. పిల్లల పెంపకంలో ఇది చాలా ముఖ్యమైంది” అంటూ ఉపాసన పేర్కొన్నారు. ఉపాసన మాటలకు నెటిజెన్స్ కూడా ఏకీభవిస్తున్నారు. మరి ఆమె రిక్వెస్ట్ తో అభిమానులు ఆ ట్యాగ్ ని ఉపయోగించడం మానేస్తారా? లేదా? చూడాలి.

BRO vs LGM : బాక్సాఫీస్ వ‌ద్ద ధోని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల మ‌ధ్య ఫైట్‌..!

ఇక నేడు జులై 20 ఉపాసన పుట్టినరోజు కావడం, అలాగే క్లీంకార పుట్టి కూడా కరెక్ట్ గా నెల (జూన్ 20న జన్మించింది) అవ్వడంతో.. రామ్ చరణ్ ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు. ఆ వీడియోలో తమ పెళ్లినాటి నుంచి క్లీంకార నామకరణం వరకు విజువల్స్ చూడవచ్చు. ఈ వీడియోలో క్లీంకార రాక తరువాత జరిగిన సెలబ్రేషన్స్ మొత్తం చూపిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే హాస్పిటల్ రామ్ చరణ్ మొదటిసారి పాపని చేతులోకి తీసుకోని అందరి ముందుకు తీసుకు రావడం, చిరు అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అంతా సంతోషంతో ఉన్న విషయాలు కనిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)