BRO vs LGM : బాక్సాఫీస్ వ‌ద్ద ధోని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల మ‌ధ్య ఫైట్‌..!

శుక్ర‌వారం అంటే సినీ ప్రియుల‌కు పండ‌గే. దాదాపుగా ప్ర‌తీ శుక్ర‌వారం కొత్త సినిమాలు విడుద‌ల అవుతూనే ఉంటాయి. అయితే.. వచ్చే శుక్ర‌వారం (జూలై 28) బాక్సాఫీస్ వ‌ద్ద ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్ న‌డ‌నుంది.

BRO vs LGM : బాక్సాఫీస్ వ‌ద్ద ధోని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల మ‌ధ్య ఫైట్‌..!

LGM vs BRO

LGM to clash with BRO : శుక్ర‌వారం అంటే సినీ ప్రియుల‌కు పండ‌గే. దాదాపుగా ప్ర‌తీ శుక్ర‌వారం కొత్త సినిమాలు విడుద‌ల అవుతూనే ఉంటాయి. అయితే.. వచ్చే శుక్ర‌వారం (జూలై 28) బాక్సాఫీస్ వ‌ద్ద ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్ న‌డ‌నుంది. అటు క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోని (Dhoni) ఇటు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) మ‌ధ్య కావ‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సి విష‌యం. క్రికెట్ దిగ్గ‌జం, చెన్నై సూప‌ర్ సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని ప్రొడ్యూస‌ర్‌గా మారి నిర్మించిన సినిమా లెట్స్ గెట్ మ్యారీడ్ (LGM). ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన బ్రో(BRO) సినిమాలు జూలై 28నే విడుద‌ల అవుతున్నాయి.

పెళ్లికి ముందు అత్త‌ను అర్ధం చేసుకోవాల‌నుకున్న కోడ‌లు..

LGM సినిమా డైరెక్టు తెలుగు చిత్రం కాదు. త‌మిళంలో ధోని ఎంట‌ర్టైన్మెంట్ బ్యాన‌ర్ కింద తెర‌కెక్కింది. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఇటీవ‌లే ఈ చిత్ర‌ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా రెండు భాష‌ల్లోనూ మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. పెళ్ళికి ముందు అత్తా, కోడ‌లు ఒక‌రినొక‌రు అర్థం చేసుకోవాల‌నే కండిష‌న్ తో రెండు ఫ్యామిలీలు క‌లిసి ఒక టూర్‌కు వెళ‌తారు. అక్క‌డ అత్తా, కోడ‌లిని ఎవ‌రో కిడ్నాప్ చేస్తారు. వీరిద్ద‌రు కిడ్నాపర్ల చెర నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు. చివరిగా అత్తని కోడలు అర్ధం చేసుకుందా అనేది మిగిలిన కథ.

Mahesh Babu : గుంటూరు కారం కోసం మ‌హేశ్ బాబు పాన్ ఇండియా రేంజ్ రెమ్యున‌రేష‌న్..?

హ‌రీశ్ కల్యాణ్,ఇవానా లు జంట‌గా న‌టించ‌గా రమేష్‌ తమిళమణి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హీరో తల్లిగా హీరోయిన్ కి అత్త క్యారెక్టర్ లో నదియా న‌టించింది. ఇక ట్రైల‌ర్ ఆద్యంతం ఫ‌న్నీగా సాగింది. సినిమా కూడా ఇలానే ఉంటుంద‌ని చెబుతున్నారు. ధోని ప్రొడ్యూస్ చేసిన మొద‌టి సినిమా కావ‌డంతో స‌హ‌జంగా ధోని అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కుల్లో ఈ చిత్రంపై మంచి ఆస‌క్తే ఉంది.

మామా అల్లుళ్ల కాంబినేష‌న్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్న‌ సినిమా ‘బ్రో’. స‌ముద్ర ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త‌మిళంలో మంచి విజ‌యం సాధించిన ‘వినోద‌య సితం'(Vinodaya Sitham) సినిమాకు ఇది రీమేక్‌. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప‌వ‌న్ దేవుడిగా క‌నిపించ‌నున్నారు. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తుండ‌గా ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, పాట‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ట్రైల‌ర్‌ను రేపు (జూలై 21)న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Vijay Deverakonda : రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ప‌రిగెత్తించిన అభిమాని.. ఏం చేశాడో తెలుసా..?