Pawan Kalyan OG Movie gets Huge Offer from Netflix OTT
OG Movie : పవన్ కళ్యాణ్ OG సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు గ్లింప్స్ రిలీజ్ అవ్వగా పవన్ ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ ఆ గ్లింప్స్ చూసి సినిమా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. OG రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. పవన్ ఇంకా ఓ 20 రోజులు డేట్స్ కేటాయిస్తే ఓజి కంప్లీట్ అవుతుందట. కానీ పవన్ రాజకీయాల బిజీ వల్ల ఈ సినిమాకు డేట్స్ ఇవ్వలేకపొతున్నాడు.
OG సినిమాకు ఉన్న హైప్ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ సభకు వెళ్లినా అక్కడ OG.. OG.. అనే అరుస్తున్నారు. ఆ రేంజ్ లో OG కోసం ఎదురుచూస్తున్నారు. మార్కెట్లో ఓజికి మంచి డిమాండ్ ఉంది. అయితే ఇంకా సినిమా పూర్తి కాకముందే థ్రియేటకల్ రైట్స్ కోసం పోటి పడుతున్న సమయంలోనే ఓటీటీకి కూడా పోటి పడుతున్నారంటా. ప్రముఖు ఓటీటీ నెట్ ఫ్లిక్స్ 100 కోట్లకు ఓజీ ఓటీటీ రైట్స్ తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీంతో OG డిమాండ్ ని బాగానే క్యాష్ అవుతుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.
Also Read : Akhil – Zainab Ravdjee : పెళ్ళికి ముందే కాబోయే భార్యతో అఖిల్.. ఫొటోలు వైరల్..
పవన్ డేట్స్ ఇస్తే వచ్చే దసరాకి గ్రాండ్ గా OG రిలీజ్ చేసే అవకాశాలున్నాయట. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో OG సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ కూడా రిలిజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. 500 కోట్ల గ్రాస్ ఈజీగా కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా, ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు.