Akhil – Zainab Ravdjee : పెళ్ళికి ముందే కాబోయే భార్యతో అఖిల్.. ఫొటోలు వైరల్..
తాజాగా అఖిల్ తనకు కాబోయే భార్య జైనబ్ రవ్జీతో కలిసి వెకేషన్ కి వెళ్ళొచ్చాడు.

Akkineni Akhil Zainab Ravdjee Went Vacation Before Marriage Photo goes Viral
Akhil – Zainab Ravdjee : గత సంవత్సరం అక్కినేని అఖిల్ జైనబ్ రవ్జీ అనే ఓ అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే తాజాగా అఖిల్ తనకు కాబోయే భార్య జైనబ్ రవ్జీతో కలిసి వెకేషన్ కి వెళ్ళొచ్చాడు.
ఇటీవల అఖిల్, జైనబ్ రవ్జీ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లే ఫొటోలు, వీడియోలు వచ్చాయి. సముద్రం ఒడ్డున ఈ ఇద్దరూ కలిసి హగ్ చేసుకున్న ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. అలాగే వెకేషన్ పూర్తి చేసుకొని కొద్దీ సేపటి క్రితమే ఇద్దరూ హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వగా ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
అయితే ఇటీవల ఏప్రిల్ 8న అఖిల్ పుట్టిన రోజు కావడంతో సెలబ్రేషన్స్ కి ఈ ఇద్దరూ వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్ కి వెళ్లారని సమాచారం. అక్కడ అఖిల్ పుట్టిన రోజు వేడుకలను ఇద్దరూ సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి పెళ్ళికి ముందే ఇద్దరూ వెకేషన్ కి వెళ్లి రావడంతో అఖిల్ – జైనబ్ రవ్జీ కపుల్ చర్చగా మారారు.