Manchu Manoj : ‘దొంగప్ప’ అంటూ మనోజ్ సంచలన ట్వీట్.. 80 శాతం కమిషన్ నొక్కేశారు.. ఈ ఫొటో పెట్టి.. మంచు విష్ణు కన్నప్ప గురించేనా?

తాజాగా మంచు మనోజ్ ఓ సంచలన ట్వీట్ చేసాడు.

Manchu Manoj : ‘దొంగప్ప’ అంటూ మనోజ్ సంచలన ట్వీట్.. 80 శాతం కమిషన్ నొక్కేశారు.. ఈ ఫొటో పెట్టి.. మంచు విష్ణు కన్నప్ప గురించేనా?

Manchu Manoj Sensational Tweet on Manchu Vishnu Kannappa Movie

Updated On : April 10, 2025 / 8:11 PM IST

Manchu Manoj : గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలిలో వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్టు ఈ వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ గొడవలు పోలీస్ స్టేషన్, కలక్టరేట్, రోడ్ల మీదకు, సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఎవరో ఒకరు ఆపుతారంటే రోజు రోజుకి ఈ మంచు ఫ్యామిలీ వివాదం ఇంకా ఎక్కువ అవుతుంది.

తాజాగా మంచు మనోజ్ ఓ సంచలన ట్వీట్ చేసాడు. మనోజ్ తన ట్విట్టర్ లో.. మీ క్యాలెండర్లని మార్క్ చేసుకోండి ది లెజెండ్ దొంగప్ప జూన్ 27 వస్తుంది. ఇంతకీ రిలీజ్ జులై 17న లేదా జూన్ 27న. 100 కోట్లకు పైగా బడ్జెట్ విస్మిత్ కమిషన్ కలుపుకొని. మూవీ పీఆర్ ప్లానింగ్ కేక అని ట్వీట్ చేసారు. ఓ పంది ముఖం ఉన్న మనిషి డబ్బులు దొంగతనం చేసుకొని వెళ్తున్న జిఫ్ కూడా పోస్ట్ చేసాడు. దీంతో మనోజ్ ట్వీట్ వైరల్ గా మారింది.

Also Read : Pawan Kalyan Son : పవన్ కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్యంపై చిరంజీవి క్లారిటీ.. ఇప్పుడు ఎలా ఉందంటే.. చిరు ట్వీట్ వైరల్..

మంచు విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27 వస్తుందని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. దొంగప్ప అని మనోజ్ ట్వీట్ వేయడంతో ఇది మంచు విష్ణు కన్నప్ప సినిమా గురించే అని, విష్ణు 80 శాతం నొక్కేసాడని ఇండైరెక్ట్ గా ట్వీట్ చేసాడు. జులై 17న రిలీజ్ అవుద్దా అని ప్రశ్నించడంతో మళ్ళీ సినిమా వాయిదా పడుతుందా అనే సందేహం కూడా వస్తుంది. మొత్తానికి మనోజ్ ఇలా ట్వీట్ చేయడంతో చర్చగా మారింది. మరి దీనిపై విష్ణు ఏమైనా స్పందిస్తాడా చూడాలి.