OG Movie
OG Movie : ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న పవర్ స్టార్ సినిమా OG నేడు రిలీజ్ అయింది. నిన్న రాత్రే ప్రీమియర్స్ పడ్డాయి. ఇప్పటికే సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చింది. పవన్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్. సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు. నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా అంతా OG నామజపం జరుగుతుంది.(OG Movie)
ఓ పక్క థియేటర్స్ లో OG హౌస్ ఫుల్ అవుతుంటే అప్పుడే ఓటీటీ అనౌన్స్ కూడా వచ్చేసింది. OG సినిమాతో పాటే థియేటర్స్ లోనే ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ ని కూడా ప్రకటించారు. OG సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది. నెల రోజుల తర్వాతే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి OG సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ మాత్రమే కాదు ఓటీటీ బిజినెస్ కూడా భారీగా జరిగింది.
Also Read : They Call Him OG : ‘ఓజీ’ మూవీ రివ్యూ.. ఇది కదా పవర్ స్టార్ స్టామినా అంటే.. ఓజస్ గంభీర విధ్వంసం..
నెట్ ఫ్లిక్స్ OG సినిమా ఓటీటీ రైట్స్ ని దాదాపు 80 కోట్లకు పైగా కొనుక్కున్నట్టు సమాచారం. అంతే కాకుండా సినిమా రిజల్ట్ బట్టి హిట్ అయితే ఇంకా పెంచేలా ఒప్పందం చేసుకున్నారని టాక్. OG సినిమా ఎలాగో సూపర్ హిట్ టాక్ వచ్చింది కాబట్టి నెట్ ఫ్లిక్స్ నుంచి OG సినిమాకు ఇంకా ఎక్కువే అమౌంట్ వస్తుందని టాలీవుడ్ సమాచారం.