OG Movie : పవన్ OG మూవీని.. డివివి బ్యానర్ వేరే నిర్మాతలకు ఇచ్చేసిందా..?

పవన్ OG మూవీ నిర్మాణం నుంచి డివివి సంస్థ తప్పుకుంటున్నట్లు, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకి ఇచ్చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజమెంత ఉంది..?

Pawan Kalyan OG Movie Production is shift from DVV to People Media Factory news

OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మూవీ ‘OG’. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో తెరకెక్కుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంటే బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా, తమిళ నటుడు అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ రాజకీయ పనుల వల్ల ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ లు పడ్డాయి.

ఇది ఇలా ఉంటే, ఈ మూవీ నిర్మాణం నుంచి డివివి సంస్థ తప్పుకుంటున్నట్లు, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకి ఇచ్చేసినట్లు వార్తలు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ అభిమానులు ఆందళోన చెందుతున్నారు. అసలు ఏమైంది, ఎందుకు డివివి తప్పుకుంటున్నారంటూ నెట్టింట ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు.

Also read : Chiru – Teja Sajja : తేజ సజ్జ బర్త్‌డే గుర్తుపెట్టుకొని.. ఇంటికి పిలిపించి కేక్ కట్ చేయించిన చిరు..

ఇక ఈ వార్తలు పై రెండు నిర్మాణ సంస్థలు క్లారిటీ ఇచ్చాయి. ‘అలాంటిది ఏమీ లేదంటూ’ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొట్టిపారేసింది. ఇక డివివి చెప్పిన విషయం ఏంటంటే.. “మేము ఈ సినిమాని వదులుకోవడం లేదు. ఆ వార్తలన్నీ అవాస్తం. ఈవారం కూడా ఈ సినిమాకు సంబంధించి మీటింగ్ ఉంది” అంటూ సన్నిహిత వర్గాలతో తెలియజేశారు. ఇక ఈ వార్తలు పై క్లారిటీ రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అవ్వడంతో.. OGతో పాటు ఇతర చిత్రాల షూటింగ్స్ కి కూడా బ్రేక్ లు పడ్డాయి. 90’s బ్యాక్‌డ్రాప్ లో సాగే ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఏపీలో ఎన్నికలు పూర్తి అయిన తరువాత.. మిగిలిన బ్యాలన్స్ షూట్ ని కూడా పూర్తి చేయనున్నారు. పవన్ చాలా కాలం తరువాత ఒక గ్యాంగ్ స్టార్ నేపథ్యం సినిమా చేస్తుండడంతో.. పవన్ అభిమానులతో పాటు జనరల్ ఆడియన్స్ లో కూడా ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.