Chiru – Teja Sajja : తేజ సజ్జ బర్త్‌డే గుర్తుపెట్టుకొని.. ఇంటికి పిలిపించి కేక్ కట్ చేయించిన చిరు..
తేజ సజ్జ బర్త్‌డే గుర్తుపెట్టుకొని మరి చిరంజీవి ఇంటికి పిలిపించి కేక్ కట్ చేయించేవారట.

Chiranjeevi celebrates Teja Sajja birthday video gone viral
Chiranjeevi – Teja Sajja : చిరంజీవి నటించిన ‘చూడాలని ఉంది’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేసిన తేజ సజ్జ.. ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆడియన్స్ కి దగ్గరయ్యారు. అయితే తేజని ప్రేక్షకులకు బాగా దగ్గర చేసిన సినిమాలంటే చిరంజీవి నటించిన చిత్రాలే. చూడాలని ఉంది, ఇంద్ర, ఠాగూర్ చిత్రాల్లో నటించి ఎంతో గుర్తింపుని సంపాదించుకున్నారు.
చిరంజీవి మాత్రమే కాదు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ సినిమాల్లో కూడా నటించి మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరయ్యారు. దీంతో తేజ సజ్జతో చిరంజీవికి మంచి బంధం ఏర్పడింది. ఆ రిలేషన్ తోనే చిరు, తేజ బర్త్ డేని గుర్తుపెట్టుకొని మరి సెలబ్రేట్ చేసేవారట. చిరంజీవి పుట్టినరోజు (ఆగష్టు 22) తరువాత రోజే తేజ సజ్జ బర్త్ డే కావడంతో చిరుకి ఆ రోజు బాగా గుర్తుకు ఉండేదట.
దీంతోనే ఆ బర్త్ డే నాడు తేజ ఫోన్ చేసి విష్ చేసేవారట. అంతేకాదు ఇంటికి పిలిచి తేజతో కేక్ కట్ చేయించేవారట. ఇలా ఆల్మోస్ట్ తేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినంత కాలం చిరు ఆ బర్త్ డేని సెలబ్రేట్ చేసేవారట. ఈ విషయాన్ని హనుమాన్ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న తేజ తెలియజేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Also read : Guntur Kaaram : సుదర్శన్ థియేటర్ దగ్గర మహేష్ ఫ్యాన్స్ రచ్చ.. నమ్రత సైతం వీడియో షేర్..
View this post on Instagram
కాగా తేజ సజ్జ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘హనుమాన్’ చిత్రం చేస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 11 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరుగుతుంది. ఈ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి సినిమా రిలీజ్ కి హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో చిరంజీవి కూడా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీలో హనుమంతుడి పాత్ర కోసం చిరంజీవి రూపాని ఉపయోగించారని సమాచారం.