స్నేహితుడు రామ్ తాళ్లూరిపై పవన్ పొగడ్తల వర్షం..
‘డైనమిక్ ఫౌండర్స్ ఆఫ్ ది 21స్ట్ సెంచరీ’ పుస్తకంలో చోటు సంపాదించిన రామ్ తాళ్లూరి..

‘డైనమిక్ ఫౌండర్స్ ఆఫ్ ది 21స్ట్ సెంచరీ’ పుస్తకంలో చోటు సంపాదించిన రామ్ తాళ్లూరి..
ప్రముఖ రచయిత క్యాథ్లీన్ ట్రెసీ రచించిన ‘డైనమిక్ ఫౌండర్స్ ఆఫ్ ది 21స్ట్ సెంచరీ’ అనే పుస్తకంలో పారిశ్రామికవేత్త, టాలీవుడ్ నిర్మాత రామ్ తాళ్లూరికి చోటు దక్కింది. ‘లీడ్ ఐటీ’అనే సంస్థ వ్యవస్థాపకుడు అయిన రామ్.. రవితేజ నటించి ‘నేల టిక్కెట్టు’, ‘డిస్కో రాజా’ వంటి సినిమాలు నిర్మించారాయన. జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కల్యాన్‌కు రామ్ మంచి మిత్రుడు. రామ్ తాళ్లూరికి ప్రతిష్టాత్మకమైన పుస్తకంలో చోటు దక్కడంపై పవన్ హర్షం వ్యక్తం చేస్తూ.. స్నేహితుడిపై ప్రశంసలు కురిపించారు.
ట్విట్టర్ వేదికగా ‘‘క్యాథ్లీన్ ట్రెసీ రాసిన ‘డైనమిక్ ఫౌండర్స్ ఆఫ్ ది 21స్ట్ సెంచరీ’ అనే పుస్తకంలో చోటు దక్కించుకున్న రామ్ తాళ్లూరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ పుస్తకంలో చోటు దక్కిన 15 మంది వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. 650 మందికి పైగా పని చేస్తున్న అతని కంపెనీ ‘లీడ్ ఐటీ’.. ఎన్నో Stratapps, Fortune Companyలకు ప్రోత్సాహాన్ని అందించింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన రామ్ తాళ్లూరి.. ప్రభుత్వ ఉద్యోగిగా.. జీవితాన్ని ప్రారంభించారు.
Read Also : మహేష్ నా బిడ్డలాంటివాడు.. అది సురేఖ కోరిక..
ఆయన అతి పెద్ద ట్రామ్‌పొలైన్ పార్క్ స్కై జోన్ ఫ్రాంచైజీకి యజమాని. ఆయన కృషి, పట్టుదలే ఇవ్వని సాధ్యమయ్యేలా చేశాయి’’ అని పవన్ పేర్కొన్నారు. ‘‘వ్యాపార విలువతో పాటు.. ఆయనకు సామాజిక సేవ, సమాజం మీద ప్రేమ తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశం బాగు కోసం కృషి చేసేలా చేసింది’’ అంటూ పవన్ తన ఫ్రెండ్ గురించి ట్వీట్ చేశారు.
Apart from your entrepreneurial spirit,you have also shown your profound social spirit & deep social commitment for the well-being of our Telugu states and Nation. pic.twitter.com/1xSSe2TvXl
— Pawan Kalyan (@PawanKalyan) April 6, 2020