Purushaha : పురుషులు అందరూ తల ఎత్తుకునేలా ఉండే సినిమా.. థియేటర్స్ లోకి వస్తున్న పురుష:..
తాజాగా ఈ సినిమా మే 22న రిలీజ్ కాబోతుందని ప్రకటిస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించారు. (Purushaha)
Purushaha
Purushaha : పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న సినిమా ‘పురుష:’. ఈ సినిమాలో సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు వులవల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్స్ వచ్చి ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమా మే 22న రిలీజ్ కాబోతుందని ప్రకటిస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇలా నేను స్టేజ్ మీద నిల్చున్నానంటే దానికి మా నాన్న గారే కారణం. నాకు యాక్టింగ్‌లో సపోర్ట్ చేసిన సప్తగిరి అన్నకి, కసిరెడ్డి అన్నకి థాంక్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సమ్మర్లో ‘పురుష:’ మే 22న రాబోతోంది. నిర్మాతగా మా నాన్న గారు అనుకున్న స్థాయిలోనే సినిమాని తీశామని, నేను నటించానని అనుకుంటున్నాను అని అన్నారు. డైరెక్టర్ వీరు వులవల మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ యాక్టింగ్‌కి ఆడియెన్స్ ఫిదా అవుతారు. నేను మళ్లీరావా, జెర్సీ, మసూద సినిమాలకు పని చేశాను. ఈ కథని ఎలా అనుకున్నానో అలానే తీయగలిగాను అని తెలిపారు.
Also See : Navya Swamy : హిమాలయాల్లో నవ్యస్వామి.. చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తూ.. ఫొటోలు..
సప్తగిరి మాట్లాడుతూ.. ఈ సినిమా మొత్తం మా డైరెక్టర్ వీరూ పైనే ఆధారపడి ఉంది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. మొదటి సినిమాతోనే డైరెక్టర్ తన మార్కు చూపించే ప్రయత్నం చేశాడు. మా దర్శకుడు వీరూ పేరు ఈ ఒక్క సినిమాతో కాకుండా ఒక పది సంవత్సరాలు వినపడేలా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. కసిరెడ్డి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా పురుషులు అందరూ తల ఎత్తుకునేలా ఉంటుంది. సప్తగిరి అన్నతో ఫస్ట్ టైమ్ నేను స్క్రీన్ షేర్ చేసుకున్నాను అని అన్నారు.

